పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

కొరగాని గవ్వలు ఎన్ని వన్నెల జెండాలతో ఎందరు దేశం మీద పడి జన్నెకిడిసిన ఆంబోతుల్లా జనాల పానాలు తోడుతున్నరు వీళ్ళ మేనిఫెస్టోలు ప్రజల బతుకు ఏమన్నమార్చేవా? వీళ్ళ అబద్ధాల సభలు ఎవరి ఆకలి ఏమన్న తీర్చేవా? లూఠీకోర్లు,జూటాకోర్లు, బటాచోర్లు, హవాలాగాళ్ళు ఎవరికి వోటెయ్యాలె ఎవరికి అధికారమియ్యాలె ఏండ్లు గడిచినా ప్రజల కడగండ్లు తీరనేలేదు ఎవడు గెలిచినా ప్రజల దినగండాలు తప్పలేదు ప్రజాస్వామ్యపాలన ఎప్పుడవతరిస్తుంది ప్రజల చేతికి అధికారం ఎన్నడన్నా వొస్తుంది ఉద్యమాలు మారె రాజకీయప్రాయోజిత సీరియళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడె ఉల్ఫాగాళ్ళ కోటగుళ్ళు ఒక్కొక్కడు ప్రజలకలల హంతకుడు దొంగనోట్ల దొంగవోట్ల రాజకీయ జూదగాడు వూర్లకూర్లు దోచి పట్నాలకు పాకినోల్లు వూర్లకూర్లు రియల్ ఎస్టేట్ల కింద అమ్మినోల్లు చెరువులు, కుంటలు, కాల్వలు, స్మశానాలు మింగినోల్లు గల్లి నుంచి ఢిల్లీ దాకా కాంట్రాక్టులు దొబ్బినోళ్ళు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే సిద్ధాంతాల మాయగాళ్ళు జేబుల నుంచి మాయపాములు తేళ్ళు రూపాయలకట్టలు తీసే గావుల కింది పందికొక్కులకు పంటభూములిడువాల్నా నోట్లకో లిక్కరుకో కుప్పలేసిన కులాల, మతాల బిర్యానీలకో అమ్ముకునే వోట్లంగడి ఎవనికి కావాలె ఎన్నికలొచ్చి ఇదివరకేంజేసినయని, ఇపుడేంజేస్తయని? ప్రజల చేతికి రాజ్యం వొచ్చేదాకా దొంగ ఎన్నికలని తన్ని తగులబెట్టు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p5cV2K

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి