'' మమతల లోగిలి '' ........శశిబాల --------------------------------------------- (కృష్ణా తరంగాలు లో నన్ను విజేతగా నిల్పిన నా కవిత ) అనుబంధాలు ఆత్మీయతలు ... దేవుడు వే( చే )సిన మమతల మణి హారాలు ఏవీ... ఎక్కడివీ ...ఏమై పోయాయి ఆ ఆప్యాయతానుబందాలు ? ఎప్పుడు వుంటామో తెలియదు ...ఎప్పుడు పోతామో తెలియదు బుద్బుదమైన ఈ చిన్ని జీవితాన పొంగించుకోవలసిన మధుర ప్రేమలు పండుగంటే తెలియని ....వెన్నెలంటే చిత్రమని తలచే బూటకపు బ్రతుకులు అతికించిన చిరునవ్వులు ..పనికి రాని ప్లాస్టిక్ బంధాలు అన్నదమ్ముల ప్రేమ ...ఆలు బిడ్డల మమత .. తల్లిదండ్రుల కరుణ ...బంధుమిత్రుల స్మరణ ... ఏ లోటూ లేని అనురాగాల కోవెలలు .. అనుబంధాల మల్లెల పొదరిళ్ళు ... ఇదే గదా భారతీయత ..ఇదే కదా సౌశీల్యత ... వసుధైక కుటుంబానికి .ఇదే కదా ముచ్చటైన ప్రతీక ఏమిస్తే కలుగుతుంది మహి (ది )లో ఇంతటి అనుభూతి ఏమిస్తే ఏర్పడుతుంది ఋణానుబంధాల వారధి (15 ఏప్రిల్ 14 )
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGcTdH
Posted by Katta
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGcTdH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి