పూర్ణిమా సిరి II వలయ గమనం II నడుస్తున్న దారిలో నక్షత్రాలను జల్లి ఎవరోవచ్చి నెలవంకగా ముస్తాబు చేయరని అప్పుడప్పుడు మీమాంసల మనోగతం నుండి మరో అడుగు ముందుకు వేస్తాం కాల పదకేళిలో పద్దతిగా కూసింత పరిణితితో సాఫల్యాలతో పాటు సంకెళ్ళనీ గుర్తించ సాహసిస్తాం తెరిచిన తాళంచెవి మరో తాళాన్నికూడా బిగిస్తుందని అర్థంచేసుకోలేక మరో తాళంచెవికై పరుగుతీస్తాం ఎప్పటికప్పుడు వృత్తపరిధి పెరుగుతుందనుకుంటామే కాని వృత్తానికావల మరో వృత్తాన్ని గీస్తున్నామని స్పురణకురాదు ఇంతకుముందు ఎన్ని గొంతుకలలో మన స్వరం కలిసి నినదించిందో ఎన్ని నిశ్శబ్ద ఖేదాలకు మౌన ఆమోదం తెలిపామో సుగంధం వెదజల్లిన పువ్వు కన్నా గుచ్చిన ముల్లు చిందించిన రుధిరం తో జీవితపు అసలు రంగు తెలిసొచ్చినా మళ్ళీ మళ్ళీ కేవలం పువ్వులనే మోహిస్తాం బలిపీఠంపై జీవితమో జీవితమే ఒక బలిపీఠమో తేల్చుకునే ప్రయాసలో మనని ఎంతోకొంత నిక్కచ్చిగా తెలుసుకుంటాం అసాధారణంగా ఆలోచిస్తూనే సాధారణ వలయాల్లో భ్రమించే అతిసాధారణ ఉనికి మనదని ఎంత చెప్పినా,ఎన్ని తెలిసినా నమ్మలేకపోతాం,ఒప్పుకోలేకపోతాం ఇంకా దేనికోసమో ఎదురుచూస్తూ మననుండి మనని తరిమేస్తాం 22.4.14
by Poornima Siri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFaJb0
Posted by Katta
by Poornima Siri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFaJb0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి