పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Sasi Bala కవిత

స్త్రీ శక్తి ..................................శశిబాల(8 march 14 ) (మహిళా దినోత్సవ కానుకగా ) .............................................................. కదలి రండి కదలి రండి నవయువతుల్లారా దారుణ మానవ మృగముల దునుమాడగ రండి తరిమి తరిమి కొట్టాలీ ...తగిన శాస్తి చేయాలి ద్రావకాలనే పోసి వారిబ్రతుకులు బూడిద లు చేసే మదమదాంధులనెదిరించాలీ ...దుర్మార్గం తొలగించాలీ నమ్ముకున్న చిన్నారుల ఆటబొమ్మలుగ చేసి నీలి తెరల నీడలలో వారి బ్రతుకుల కాలితో రాసే కామాంధుల నరికట్టాలీ ..కటినంగా శిక్షించాలీ పసుపుతాడు బంధాన్ని పరిహాసాలాడి పలుపు తాడునే వారికి కానుక చేసే వారికి చెప్పులతో శాస్తి చేసి తప్పును తెలిసేలా చేసి ఆడదంటే ఆబల కాదు సబలని చూపించాలి అమాయకపు కన్నె పిల్లల పై మృగములుగా ..పశువులుగా దూకి మానభంగం చేసే రాక్షసులను నరికేయాలీ వారి పొగరును అణిచేయాలి మీరందరూ ఒక్కటిగా ఎదిరించిన నాడు లేవు దమనకాండలు ...లేవు ప్రాణ త్యాగాలు సంఘం లో వున్నా కుళ్ళు సమ్మూలంగా పెరికి ఆడదంటే అన్నింటా దీతేనని చాటాలి

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dB4CEn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి