ఉంగిడి* ---------- రావెల పురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^ మా వూరికి ఉంగిడొచ్చినట్టుంది నాముపంటను నాకేసి డొక్కలెగరేసే గొడ్డులా ఎగిరెగిరి పడుతుంది. ఎంత చింతపండును పిసికి రసాన్ని పులుసులాజేసి గొంతులో బొంగు గొట్టంతో దిగబోసినా వాగు వొడ్డును ఎక్కలేక కళ్ళు రెండింటినీ తేలేస్తూ ఊపిరిసలుపకుండా ఉక్కిరిబిక్కిరై పోతున్నది. ఎన్నిక సమయంలో మన్నికైన అభ్యర్ధిని ఏకంగా ఎన్నుకోలేని చవటలా ఎగాదిగా దిక్కులెంట జూస్తూ ఏబ్రాసి ముఖమేసుకుని ఏవో పిచ్చిలెక్కలతో వేళ్ళమీద గుణించుకుంటూ మనాదితో మనువాడిన మనిషిలా నాగొడ్డుగూడా నాదిగాకుండా పోతుందేమోనని నా సదసత్సంశయం **************************08-03-2014 ఉంగిడి****తొలకరి జల్లులు పడిన తర్వాత చేలో మొలిచే నాము[కోసిన జొన్న పంట మొదళ్ళలో మొలిచే మొక్కలు] తిన్న గేదెలు విషపూరితమై గిలగిలలాడి కొట్టుకుంటాయి ఆ జబ్బును ఉంగిడి అంటారు.దానికి విరుగుడుగా చింతపండును రసంలా పిసికి, పిండి పోస్తారు] ------------------------------------------------------------------
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P9VNZL
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P9VNZL
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి