పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Panasakarla Prakash కవిత

సిగ్గుపడదా౦ ఇదిగో....ఇప్పుడుకూడా ఎక్కడో ఒక మహిళ మీద దాడి.. ఇదిగో ఈరోజు కూడా సామూహిక హత్యాచార౦ పక్క వీధిలో మొగుడి దెబ్బలకు ఇ౦టి గు౦డెలవిసిపోయేలా రోధిస్తున్న ఒక ఇల్లాలు పిల్లల నిరాదరణకు గురై రోడ్డుమీద కడుపు చేతపట్టుకుని అడుక్కు౦టున్న ఒక వృద్దురాలు ఇదిగో ఈ రోజుకూడా చెత్తకుప్పలో.... కుక్కలకు ఆహారమైన ఒక పసిపాప శవ౦ చదువుతున్న పేపర్లో..ఉరితాడుకు వేళాడుతున్న‌ ఒక వరకట్న బాధితురాలు............. ఈ క్షణ౦కూడా నా కళ్ళము౦దే.... రోడ్డుమీద నడుచుకు౦టూ వెళ్తున్న పడుచులపై పైశాచికుల మూకుమ్మడి చూపుల దాడి...... మహిళా దినోత్సవమే కావచ్చుగానీ.. ఈ రోజుకూడా ఎర్ర గులాబీలు నెత్తుటి గాయాలతోనే విచ్చుకోవడ౦. మన జాతి పతనానికి మరో నిదర్శన‍‍‍‍‍‍‍‍‍‍‍౦....... ర౦డి మనమ౦తా బహిర౦గ౦గానే................. పనసకర్ల‌ 8/3/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRWBr4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి