శ్రీస్వర్ణ || మహిళ|| ఆలిగా,తల్లిగా భాద్యతలు నిర్వహించగలదు నేటిమహిళ అంతరిక్షంలోపాదం మోపి తనసత్తా చాటిన ధైర్యశాలి `కల్పనాచావ్లా'..మహిళే ! రణభూమిలో ప్రళయకాల రుద్రునిగా చెలరేగిన`'ఛత్రపతిశివాజీ'ఖడ్గానికి శౌర్యం నెర్పి సానబెట్టిన జిజియాబాయి మహిళే ! తెల్లదొరల ఆధిపత్యానికి తన కరవాలం కరకుదనాన్ని చూపించిన ఝాన్సీలక్ష్మి ..మహిళే ! అపారమైన మేధస్సుతొ గణితంలొమేటిగా పేరొందిన శకుంతలాదేవి..మహిళే! పరుగుల సౌరభాలు భరతమాత ఎదపై వెదజల్లిన పి.టి.ఉషా..మహిళే ! పంజాబ్ మణిమకుటం..కర్తవ్యపాలనలో కదంతొక్కే కిరణ్ బేడీ మహిళే! మువ్వన్నెల పతాక వైభవాన్ని హిమశ్రెణులపై గర్వంగా నిలబెట్టి భరతమాత మనసును ఊయలలూపిన బచేంద్రిపాల్..మహిళే ! సాహితీవనంలొ మందారాల మకరందాలు కురిపించిన భారతకోకిల సరోజినీనాయుడు..మహిళే ! రామాయణాన్ని లిఖించి సుగంధాలు పంచిన మొల్ల కూడా మహిళే ! మానవత్వపు మల్లెలు గుబాళింపచేసిన మదర్ థెరిసా..మహిళే! ఉరకలెత్తే ఉత్సాహంతో ఉప్పుసత్యాగ్రహంలోపాల్గొన్న సమరయోధురాలు దుర్గాభాయ్ దేశ్ముఖ్ కూడా మహిళే ! భరతమాతకు కీర్తి పతకాలను అందించిన కరణం మల్లీశ్వరీ ..మహిళే!
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O4goh7
Posted by Katta
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O4goh7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి