ఈనాటికవిత-75 _________________________________ బాలు వాకదాని ||బ్రతుకు పోరాటం|| బిందాస్ మాటలన్నీ మనోనిబ్బరంకోసమే, కడుపు నిండికాదు వీధి వీధి తిరిగేది ఆసరాకోసమే, ఆనందం కోసం కాదు అంతర్జాల గోడలపై తగిలించిన బొమ్మలన్నీ పాతవే, కాస్త ఉరటకోసం బాకీ లెక్కల కాగితం గుండెను తడుముతుంది చొక్కా జోబులోనుంచి నా వాళ్ళంతా నిలదీస్తున్నారు నన్ను నిలబెట్టటానికి అణిచిపెట్టిన ఆసక్తినంతా కొలమానాలతో చూపించాలెమో! దగాపడిన హృదయం మరోసారి సిద్దమౌతుంది తాకట్టుకి తగలపెట్టిన ఆదర్శాలు, సిద్ధాంతాలలోనుంచి తీసిన ఆయుధంతో మంచి మనసుని పొడవాలి కావలిసిన దానికోసం కసితో నేన్నుంటే, కాకమ్మ కథలంటారేమో! దారంతా వెతుకులాటే, కాస్త వెలుతురు వేసేవాళ్ళు తోడైతే భావుండు మన:శాంతి, మనోవేదన పట్టింపులేమీలేవు, కాస్త పనుంటే చాలు ఇంతకన్నా సాక్షాలు ఏంచూపను? రూపీకోసం, రోటీకోసం చస్తున్నానని * * * చాల సార్లు కవిత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు మానసిక మైన అంసాల గురించి మాట్లాడుకొవాల్సి వస్తుంది.దాని కారణం వ్యక్తీకరణ అనేక అంశాలని దాటి మనొవైఙ్ఞానిక భూమికతో విరాడ్రూపాన్ని పొందింది. మనషి నిజాయితీగావ్యక్తమవడంలోని సంశయాన్ని,క్రియా రహిత స్పృహని బాలు కవిత్వీకరించారు.యూంగ్ ఉమ్మడి అచేతనల్లొ చెప్పిన అంశాలలొ ఆచ్చాదన ఒకటి.మనది కాని అంశాన్ని పట్టుకుని ప్రవర్తించడం అలాంటిదే.బయటీకి వ్యక్తమౌతున్న తీరుకు అనుభవిస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసం ఉంటుంది.ఈ వ్యత్యాసాన్నే కవిత్వం చేసారు బాలు. ఈవాక్యాల్లో నిరాశ,నిరాసక్తత ఉన్నాయి.క్రియాశీల చైతన్య స్పృహ లోపించినప్పుడు మనిషిలోని భావాలు,చైతన్యము ముసుగువేసుకుని ఉంటాయని హెగెల్ అన్నాడు.దారిద్రయం పట్ల నిరసన క్రియాషీల చైతన్యంతొకాక దయ,సానుభూతి,పరొపకారం లాంటి రూపంలో వ్యక్తమౌతుంది.ఆధునికంగా ఇది లొటులేనితనాన్ని అనుభవిస్తున్నట్టు నటిస్తుంది. ఈ ఆచ్చాదననించే బాలు మాట్లాడారు. బాలు వస్తుపరంగానె కాదు.తనదైన వైయ్యక్తిక నిర్మాణ ముద్రకూడా వ్యక్తం చేసారు.బాలు మరిన్ని మంచి కవితలతో తనని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం.బాలు వాకదాని కి అభినందనలు
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvlmDv
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvlmDv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి