ఎగిరేది తిరుగుబాటు ఎర్ర రంగు చిహ్నమే... ఎక్కడైతే మానసిక క్షోభకు గురి అవుతావో ఎవ్వరైతే నా అనుకున్న వాళ్ళు నిన్ను లెక్కకేసుకోరో పదుగురిలో నీకు పేరున్నా నిన్ను నీ చాటు మనుషులే దిగజారుస్తుంటే నువ్వేస్తున్నఅడుగు ముందడుగు అయినా బురద అంటగడుతుంటే బావిలో కప్పని నీ సమర్ధతని వంకపెడుతుంటే పిల్లి అని నిన్ను చులకన చేస్తుంటే నీ బతుకు నీకు బోర్ కొడుతుంటే నీ వాళ్ళు నిన్ను అవమానిస్తుంటే అప్పడే అప్పడే ఆ క్షణమే అటు పిమ్మటే ఆ తరుణం నువ్వో కిరణం అవుతావు బావిలో నుంచి పిల్లి కాన్నుంచి పులిలా గాండ్రిస్తూ క్రొత్త త్రోవ్వై నూతన కాలమై నవ గీతమై దశ అవతారమై మార్మోగే నాదమై మరో ప్రస్థాన మహా ప్రస్థాన రథ సారధి నువ్వై కోటి అశ్వాల గెలుపు సంకేత ధ్వని నువ్వై అనంత పతాక రెపరెపల పవన కెరట సడి నువ్వై జ్వలిస్తూ జ్వలిస్తూ లావాలా పెల్లుబికే సూర్యుడిలా ఎరుపెక్కే నీ దారికి ఎదురేది నీ నీడ కు గొడుగేది నీ చలనానికి అంతేది నీ వెలుగుకి చీకటేది నీ జెండే విప్లవ శిఖరమైనాకా శిఖరంపై ఎగిరేది తిరుగుబాటు ఎర్ర రంగు చిహ్నమే.......షేక్ మీరా ,,,,,,,, 16/03/2014
by Shaik Meera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7LAue
Posted by Katta
by Shaik Meera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7LAue
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి