పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Aruna Naradabhatla కవిత

కన్నీటి విందు ___________అరుణ నారదభట్ల కొంత కాలంగా మా వాడలోని ప్రదాన రహదారంతా సందడే! వచ్చిపోయే వాహనాల రద్దీ పట్టణ జీవనానికి పరమావధే గానీ మూలమలుపు నుండీ ముక్కుపుటాలు గజిబిజి గందరగోళంలో గల్లంతులో పడతాయి! పొద్దున్నే రోడ్డెక్కి బాధ్యతగా పర్సునింపుకొని ఇల్లు చేరే ప్రాణాలకు ప్రేమగా అక్కున చేర్చుకునే ఆప్తుడిలా నడి బజారులో ఓ అద్దాలమేడ! మాయకమ్ముకోవడం అక్కడే మొదలు! మసక చీకటిలో మనసు జోరు నిండిన జేబులు నిలువునా నాళీలో ఖాళీగా పడిపోవడం! నూనెలో వేగే జీవితాలు ఆ అడ్డకు ఆనవాళ్ళు... బండెడు మల్లెపూలు కూడా అక్కడి గాలికి తలవంచుకొని పోతాయి! చుట్టుపక్కల జీవితాలు కొంగు కప్పుకొని పదిల పడాలి... ఏ మైకం మీద పడుతుందో తెలియని స్థితిలో అసహ్యించుకునే గుబులు చూపులు పక్కనున్న హాస్పిటలుకు వెళ్ళాలన్న అక్కడినుండే! నడిచే దారంతా మత్తు కమ్ముకొని స్వచ్చతకు కూడా మాయరోగం అంటగడుతూ పచ్చని పసి మొలకలు కూడా వాడిపోయేలా వీధిన పడి నిలుచుంది! సొమ్ము కోసం రాజకీయం భావితరాన్ని బలిపశువును చేసింది! యూత్ చేతులిక్కడ బాటిళ్ళతో చీయర్స్ కొడుతున్నాయి.... కాలేజీ కల్చర్లు బార్లముందర బారులు తీరి కన్నగుండెలను...కన్నె గుండెలను కన్నీటితో తమ గ్లాసులు నింపి వడగట్టి వడిపెట్టి తాగుతున్నాయి! ఇప్పుడీ విందు ప్రతి సందీ వ్యాపించింది నోళ్ళుంటే రోడ్డూ తల బాదుకొనేలా నేతన్నల నిర్వాకం జీవితాలతో ఇలా చెలగాటం! 16-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXRmf6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి