నాశం లేని బంధం --------------------------- రాయిగా ఉండేవాడిని శిలగా ఎందుకు మలిచావు ? శిలగా ఎదిగాను ప్రాణం ఎందుకు పోశావు? నా కనులు చెప్తాయి నువ్వు అందించిన భావాన్ని అది నీకే అర్ధమవుతుంది నీ హృదయంలో దాగిన నిజాన్ని నువ్వు చెప్పకుండానే నాకిక్కడ అర్ధమవుతుంది మనమిద్దరం పరస్పరం చెప్పుకునేటప్పుడు ఇక పరిభాష మనకెందుకు? అంతరాంతరాలలో మాట్లాడుకునే మనం ఇతరులకు అర్ధమవుతామా? ఆశా ఉలి ఘోషా నా ఊపిరి నాదమవుతాయి ప్రేమగా ప్రేమతో దీనిని చెప్పనా..? ఎప్పటికీ నాశం లేని బంధం మనది ----------------------------- మూలం తమిళ కవి పాలని భారతి అనుసృజన యామిజాల జగదీశ్ మూలానికి కొన్ని మార్పులు చేసాను. 16.3.2014 -----------------------------
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFOleA
Posted by Katta
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFOleA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి