కొంతం వేంకటేశ్: హోలి...: హోలి అదెక్కడ.. సంధ్యా సుందరిని ముద్దాడి సిగ్గులుపోయిన తామరసాప్తుని కెంజాయ లోన కదా..! హోలి అదెక్కడ.. తుషార శీతల సరోవరాన నెలరేణి అనురాగ చూడ్కుల నడుమ వగలుపోయిన కలువ వాసంతి దగ్గర కదా..! హోలి అదెక్కడ.. రయమున పరుగెడుతున్న రవి కీరణం చందానికి నీలి వర్ణం పులుముకున్న అంబరపు సంబరానిది కదా..! హోలి అదెక్కడ.. మధ్యాహ్నాపు మార్తాండుని పరిష్వంగమున నలుపు తెలుపుల మిశ్రమాన్ని సంతరించుకున్న సముద్రుడి సరదాలది కదా..!! హోలి అదెక్కడ.. పంచశరుని వింటి దాటికి పులకించిన వనకన్య చిలిపిదనపు సెగల లోన కదా..! హోలి అదెక్కడ.. నీ చూపులు నా చూపులతో పెనవేసి విరితూపులు అయినప్పుడు కదా..! హోలి అదెక్కడ.. నా కన్నులు నీ కన్నులతో ఊసులాడి బాసలు చేసిన సేసల లోన కదా..! హోలి అదెక్కడ.. నీ హృదయం నా డెందం గూడి కుసుమ రంజిత సరాగములను ఆలపించుట లోన కదా..! హోలి అదెక్కడ.. నా ద్యాస నీ శ్వాస జతగూడి సంతసమున మయిమరచిపోవుట లోన కదా..! హోలి అదెక్కడ.. నీ మనో ఆకాశములో నా మనస్సు సంచరించి హరివిల్లయి విరిజల్లును వర్షించినపుడు కదా..! హోలి అదెక్కడ.. నేనే నీవై నీవే నేనై అనంతదారులలో అర్ధనారీశ్వర తత్వమును ఆవిష్కరించుట లోన కదా..! హోలి పండుగ శుభాకాంక్షలు..!! 16/03/2014
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQshW3
Posted by Katta
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQshW3
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి