Naa kavitaku Peddalu Kapila Ramkumar gaarichchina andamaina roopam.Dhanyavaadaalu sir! ....హోలికా దహనం... చీకాకుల ఏకాకులు మదిని దూరి రొదపెడుతున్నాయ్ వీపున పాపపు మూటలు గుదిబండలుగా వ్రేలాడుతున్నాయ్ ఈ జన్మవా..గత జన్మవా.. మరి ఏ జన్మవో తెలియరాకున్నాయ్ నిరాశల ఈసుళ్ళు మోమునిండా ముసురుతున్నాయ్ అందినట్టె అంది ఆనంద ఝరులెండమావులై మారిపోతున్నాయ్ అందినది అందగించక మరి అందనివేవో అమృతభాండములౌతున్నాయ్ అందాల ఆనందాల అందలాలెక్కాలలన్న మనసు గారాలు మారాలు చేస్తున్నాయ్ అందాల రేడు లేడని ఆశల విరులు ఆవిరులౌతున్నాయ్ సంసార సారాల నీరాలు క్షార సాగర క్షీరాలౌతున్నాయ్ మదిని మధురోహల తావున మౌనఘోషలెక్కువయ్యాయ్ మాసిన తలపులు తలుపులు మూసుకుని తలనిండా తన్నుకు ఛస్తున్నాయ్ చివరన శృతి తప్పిన యద రాగాలు అరణ్య రోదనల తలపిస్తున్నాయ్ చాలు చాలు స్వామీ.. ఇకనైనా రావేమీ? ఈ కోరికల "హోలిక"ల దహియింప క్షీరసాగర తరంగిణుల నను రక్షింప త్వర త్వరగతిన్ దశావతారాల దేనినైనా పూనో లేక ఏకాదశావతారుడవై రమ్ము నన్నుద్ధరింప..
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxhi1d
Posted by Katta
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxhi1d
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి