పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----।। కూతురు మళ్లీ పుట్టింది ।। ఊపిరి విడిచి మరుభూమి చేరాల్సిన ఆ భౌతికకాయం ఎదురుచూస్తోంది వొళ్ళంతా మృతనేత్రాలు చేసుకుని . ఏ బండల సావాసంలో రాతిగా మారాయో ?ఆ గుండెలు కాలం చేసిన తండ్రి కట్టెను కటిక రాయిగా పడుండమన్నాయి . పంచుకున్న మాంసంముద్ద,పీల్చుకున్న నెత్తురుచుక్క, పెనవేసుకున్న పితృబంధమూ కనీసం పాశంగానైనా మారలేదు . తనువు చాలించి నిర్జీవమైన పార్ధివదేహం పొందింది స్వర్గం బ్రతికి మిగిలిపోయినా .. సుపుత్రుల నిర్వాకం బరించలేక అడుగడుగనా నరకం . చచ్చిన మనిషి పుచ్చిపోడుగా తన మరో పేగుబంధం ఉరికింది ముందుకు కొరివి చేతబట్టి ఆ తండ్రి అంతిమయాత్రకు అన్నీ తానై . కొడుకుల పాపపు నీడ పడకుండా పున్నామ నరకం తప్పించి,కన్నరుణం తీర్చి మరోసారి జన్మించింది ఆ తండ్రికి కొడుకుగా ! (ముగ్గురు కొడుకులు ఉన్నా ఓ తండ్రికి కొరివి పెట్టటానికి ముందుకు రాకపోవటంతో ఓ కూతురు ఆ కార్యక్రమం చేసిన వార్త పేపర్లో చదివి ... ) (16-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PFpT7M

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి