//జయ రెడ్డి బోడ // ఓ కవి కల ఇలా // మంచితనమంతా చరిత్ర ప్రవాహంలో కలిసి పోయి గతమంతా ఘనీభవించి ,, ఈ మర మనిషి లోకమంతా నాగరికతల ముసుగులో మునిగి మమతలు దహనమై మనసు మసి అయిపోయి.. విశ్వమంతా ద్వేష విషజ్వాలలు సంతరించుకున్నాక ఎక్కడి నుండి వచ్చారో ఆ కాంతి వీరులు, వారితో పాటు జతకట్టి ఇంకొంత "మానవత వాద" దూతలు, కొన్ని అనుభూతులు మిగుల్చుకున్న పిట్టలకు అవాసాలుగా మారి కల్లోల నిశీధి లో బలవన్మరణం లా కల్లుమూసుకొని, నిర్వీర్యుడు గా కాలం గడుపుతూ ఉన్న నన్ను, తమ సూటి ప్రశ్నల ములుకులతో గ్రుచ్చుతూ,ఒక ప్రక్క అక్షర తీపిదనాల ఆశ చూపుతూ వారంతా ఒకటే పోరు .. ఆశలు ఆవిరై .. ప్రేమ తైలం అడుగంటు నప్పుడు క్రొత్త వత్తులు వేయమంటారు ఎలా .. ఆకులు రాలి మోడువారిన మనసులకు క్రొత్త చిగురులు పూయించమంటారు .... మ్రొగ్గ దశలోనే ..పర భాషా యంత్రాలుగా మారుతున్న, పసి హృదయాలకు మాతృ భాషా కంచెలు నిర్మించమంటూ .. కానీ ఎలా ? ఏలిక లే, ఓటూ సీటూ కోసం మధ్యం వర్తకం వ్యాపింప చేస్తున్నప్పుడు ఇక పామరులు ఆ పాపపు నోటుకు అమ్ముడై, పంక రూపముగా మారి పోతున్నప్పుడు అనుమానపు వైవాహికం అదాలత్ అద్దాల్లో విడి వడి, బొమ్మలుగా మారినప్పుడు, ఉమ్మడి జీవనం తెగిన తోక చుక్కలుగా రాలి కనుమరుగైనప్పుడు, ఆరాద్యమె.. వెక్కిరింతలుగా తెరపై వాదోపవాదాలుగా పరిణమించినప్పుడు మనుష్య సంబంధాలన్ని తమను తాము,తామే సృష్టించుకున్న డబ్బు మూటల్లో బంధించుకున్నప్పుడు ఒక చోట తోట కోసం, ఒక చోట ఫ్లాటు కోసం, ఒక చోట మూల ధనం మూట కోసం పేచిలై, కన్న వారి పోషణ కాటిన్యమై ప్రస్నార్ధకం గా మారినప్పుడు.. ఇలా దేహాలన్నీ శత సహస్త్ర పైశాచిక అనందాల్లో పడి ఇహ పర సంబంధాలు వీడి కొట్టుకుంటుంటే, ఇక ఎలా జరుపను ? ? ? ఒకరి నొకరు ఆత్మలతో కలుసుకొనే ఆ కవి సంగమాలు కవిత్వపు ఇష్టా గోష్టులు, మనిషి మనసుకు మమతలు అద్దీ మళ్లీ మానవత్వపు పరిమళాలు వెదజల్లే ప్రక్రియ జరిగేనా? కవి కన్న కలలు నెరవేరేనా ఇక ఈ మనుష్య జీవితానికి మేలు జరిగేనా .. ఇంకొన్నాళ్ళకైనా ..ఇంకెన్నాళ్ళ కైనా .... ఇది ఇలా జరిగేనా ??? (16-03-2014.. ప్రపంచ కవిత్వ పండుగ రోజున..కవి కల నిజం కావాలి అని ఆశతో )
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMLcX
Posted by Katta
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMLcX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి