||ప్రేమ నాణెం|| ప్రేమ.. ప్రేమలో ఉన్న ప్రేమికులను ప్రేమిస్తే... హాయి రాగాలతో సాగే మౌన గీతాల సంగీతమై వినిపిస్తుంది..!! చూపుల పలకరింపులతో కనుసైగలు చెప్పే కబుర్ల కాలక్షేపమవుతుంది..!! అందమైన అలకలతో కవ్వించే కోరికల వినోదాన్ని పంచుతుంది..!! ఊహల ఊసులతో మరుపురాని తలపులు చేసే ప్రమాణమవుతుంది..!! చిలిపి చిరాకులతో పలకరించే పరాకుల సరసమవుతుంది..!! కస్సుబుస్సుల కసురులతో తేనె కోపాలు వ్రాసే కమ్మని కావ్యమవుతుంది..!! ఇలా ఆనంద చిరునామాల బంధాన్ని చేరువ చేస్తూ చిరునవ్వుని చిందించే సంబంధాన్ని చూపిస్తూ తనలో ఒకవైపును పరిచయం చెస్తుంది ఈ ప్రేమ నాణెం !! ఫ్రేమికులు ఏది మరిచినా పర్వాలేదు కానీ ఆ ప్రేమనే మరిస్తే... వీచే గాలి సైతం విరహ వేదనతో నిండుకోగ వియోగ రాగంలో శ్రుతిలేని సంగీతాన్ని మ్రోగిస్తుంది!! చూపుల దారుల్లో చెరిగిపొని స్మృతులన్నీ చేరగా కన్నీటి చుక్క ఒంటరిని అయ్యానని కన్నీటి పర్యంతమవుతుంది!! కోపంలో అలిగిన కాలం అంధకారం మిగల్చగా అనాథగా మిగిలిన స్నేహం తోడు కిరణాల నీడ కోసం వెతుకుతుంది!! ఊపిరి అందక ఊహలన్నీ కొట్టుమిట్టాడగా మరుగునపడ్డ తలపులన్నీ మరణమంచున మిణుకుమిణుకుమంటున్నవి!! చిరాకులో చిరిగిన ఆశ ఆఖరి శ్వాసలో ఉండగా పంతంతో ప్రాణం కోల్పోతున్న ప్రేమ బ్రతకాలని ఆరాట పడుతుంది!! కన్నెర్రజేసిన కోప తాపాలు తీరని వైరాన్ని కోరుకోగా విరిగి ముక్కలైన మనసు విషాద సాహిత్యాన్ని రచిస్తుంది!! ఇలా విచార గుండంలో చిక్కుకుని ఒడ్డుకి చేరటంలో విఫలమైన ఓడలా చెదిరిన చెలిమి చిగురించదనే చేదు నిజం దిగమింగుతూ తనలో రెండోవైపుకి తెర తీసి ఏడిపిస్తుంది ఈ ప్రేమ నాణెం !! జ్ణాపకాల పాఠశాలలో అనుభవాలు నేర్పించిన పాఠం.. వలపు మలుపుల్లో మది వ్యధను వ్యక్తపరచలేక విస్మయం.. సుఖ-దుఃఖాల మైత్రిలో ఏది మిగులునో తెలియని అయోమయం.. జంట భావనల ఒంటరి నిలయం.. ఎన్నో జీవితాలను శాసించే ఈ ప్రేమ నాణెం!! 03.02.2014 #సంతోషహేలి
by Santosh Kumar K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icfokE
Posted by Katta
by Santosh Kumar K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icfokE
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి