లాస్ట్ పెగ్ కారణాలు సెప్పడం కోసం మొఖమొకాలు సూత్తే నా దగ్గరొక నవ్వు , నీ దగ్గరొక నవ్వూను ఎందుకంటే ప్రేమంట? అనడగాలని అనిపించలేదు. కొద్దిపాటి మాటలకి కళ్ళు తడుస్తాయని తెలిసీ రాసినదంతా నిజమేనా అంటే నిన్ను వెనక్కి తీసుకెళ్ళి సూపించలేను నే చెప్పేది విను అన్నకాడల్లా కుప్పకుప్ప్పలుగా ప్రేమున్నట్టు కొద్దిమందికే తెలుస్తాది అదికాదురా అని అతనితో నువ్వు వాదిస్తుంటే నాకొక్కటే అనిపిస్తది కొందర్ని గెలవడానికి యుద్దాలతో పని లేక మాటల్ని మనమే సృష్టించుకోవాలని. మాట్లాడడం అయిపోయాక మళ్ళీ కళ్ళు సూసుకుంటే, నాన్నకి సెప్పినట్టే ఒరేయ్ ఇది లాస్ట్ పెగ్ మనమెల్లి పడుకుందాం అనాలి నేను. చెరొక దిండూ సర్దుకున్నాక నువ్ గురకెట్టకుండానే నేను నిద్రపోతే అచ్చం నాన్నలాగే నిన్నూ లేపాలి రాత్రి మేల్కొన్న రంగంతా కళ్ళలో ఉండి కళ్ళెర్రజేసినట్టు కనబడతా ఉంటే కొందర్ని గెలవడానికి యుద్దాలతో పనిలేదని మాటల్ని మనమే సృష్టించుకోవాలి సందర్భాల్ని సేజిక్కించుకుంటామో లేదోగాని లాస్ట్ పెగ్ లన్నీ సెప్పేదొక్కటే కళ్ళుమూసి గ్లాసులోది గొంతులోకూసినట్టు మనసులోది మనుసుల్లోకి ఊసేయ్యాలి. 01/02/2014
by కాశి గోవిందరాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nGVS3N
Posted by Katta
by కాశి గోవిందరాజు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nGVS3N
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి