పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

డా కాసుల లింగ రెడ్డి గారు రాసిన కవిత !!ఇడుపు కాయితం ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ ఉద్యమ నేపద్యం గా వచ్చిన కవితలు ఎప్పుడు స్పూర్తిని అందించేవి గానే వుంటాయి, అణచబడిన ఒక జాతి ఆత్మ ను ప్రతిబింబించేది లా సాగుతుంది లింగ రెడ్డి గారు రాసిన "ఇడుపు కాయితం ", రెండు ప్రాంతాల వారిని కళ్యాణ బందం తో ముడివేసి తన యాస ను భాష ను ....ఎలాగా అవమానం చేసారో ...., ఏమి లేని స్తితి లో తన దగ్గరకు వచ్చినపుడు ఎలా ఆదరించారో ఒక కద లా అల్లుతూ వెళ్లారు ... మొత్తం 5 యూనిట్లు గా, జరిగిన వాస్తవ పరిస్థితులను ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ....ఇక్కడ ఒక ప్రాంతాన్ని భార్య తో ను ..మరో ప్రాంతాని భర్త తో ను పోల్చారు ....ఆమె అంతరంగాన్ని ...మొదటి లైన్ లో నే ....జరిగిన చారిత్రిక తప్పిదాన్ని ...చూపుతూ ...ఇంత రాద్ధాంతానికి అతడే కారణం అంటూ విమర్శ ను ఎక్కు పెట్టిస్తారు //పుస్తెలతాడు కట్టించి//తన్నుకు చావమని.//సాపెన పెట్టిండు సచ్చినోడు. వలస వాదుల గా వచ్చినా కూడా ...అక్కున చేర్చుకొని, ఆదరించి తన ఇంటి లో ....స్థానం ఇచ్చినా తను ఏ మాత్రం అయిన గర్వం చూపించనా ...?, లేదు ...కాపలా కుక్క లా నా వెంట తిప్పుకున్నానా ??..ప్రతి దశ లో తెలంగాణా చూపించిన ఆదరణ కన్పించింది అయిన నేను అన్ని సహించాను అంటూ కొన్ని పాదా లలో అద్బుతం గా చెప్పారు గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె//కుడిదాయి కుడిపి కుతిదీర్చిన//.నిన్నేమన్న కర్రె కుక్కను చేసి//ఎంటదిప్పుకుంటినా? ఉద్యమం తీవ్ర స్థాయి లో ఉన్నపుడు సర్ది చెప్పి మరల కలిపి ఉంచే పెద్ద మనుషుల ఒప్పందాన్ని మననం చేసుకుంటూ రెండు ప్రాంతాలను కలిపి ఉంచే ఒప్పందాన్ని కాగితం పై నిలిపారు ...., కవిత మొత్తము కూడా భార్య తన స్వగతాన్ని చెప్పుకుంటూ ...ఇలా కూలిపోవాల్సిన కాపురాన్ని కాగితం పై నిలబెట్టారు ఇక్కడ ఇన్నాళ్ళు కలిపి ఉంచిన ఒప్పందం ...భార్య భర్తల మధ్య అయిన ..ప్రాంతాల మధ్య అయిన ...విశదీకరిస్తుంది .i నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి//.పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య//కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి. జరగబోయే అనర్ధాన్ని ముందే పసిగట్టి కలిపి ఉంచే ప్రక్రియ ని ఆనాడే వ్యతిరేకించాను ...కాని సంపదలు నీకు సందేశాలు నాకు అంటూ సర్ది చెప్పి మళ్ళా కలిపి ఉంచారు పెద్ద మనుషల మధ్య కూర్చుండ బెట్టి , నిజమే కదా... //సంపదలు నీకు//సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి//ఈ కాపురం నేనొళ్ళనంటె//కాసింత సర్ది చెప్పికాయితం మీద కాపురం నిలిపిరి. తన ప్రాంతంపు మాండలికం పట్ల జరుగుతన్న అన్యాయాన్ని, హేళన కు గురి కావటాన్ని చూసి సహించ లేక నిలదీసినట్టు గ అనిపిస్తుంది, తన భాష యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ ...నన్ను కట్టుకున్నప్పుడు నా భాష ను చీదరించడం ఎందుకు, నా నుడికారాన్ని ముత్యం లాంటి యాస ...ని ఎక్కిరించటం ఎందుకు ...? సత్యమే ... మాతృ భాష అమ్మ తో సమానం అంటారు అలాంటి భాష హేళన కు గురి అవుతుంటే ఎవరికైన బాదేస్తుంది ... //కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ//కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష//బాగలేదని చీదరిస్తివి.// ఎగిలివారగట్ల//వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి//యాసనెక్కిరిస్తివి తన జీవన విధానం పై కధలు చెప్పి సొమ్ము చేసుకున్నావు, నా నదులను దోచి పెట్టి నీకు ఇస్తే....నీళ్ళకు బదులు కన్నీళ్ళు ఇచ్చావు ....బదులు ఇమ్మని ప్రశ్నిస్తుంది ... కట్టుబొట్టుమీద కథలల్లి..//కోట్లు కూడ పెడ్తివి. సెలిమలు దోచి//సేనెండవెడ్తె//కన్నీళ్ళు నాకాయె//నీళ్లు నీకాయె. తన ప్రాంతానికి వచ్చి ...తన భూమి ని ..తన పంట పొలాలను ఇంటి చుట్టూ సర్కార్ తుమ్మల మధ్య వంటరి ని చేసి బంది ని చేస్తివి ...రోగి లెక్క ఆయాస పడ్తున్న ... నా ఇంటి చుట్టూ మొలిచిన//ప్రైవేటు ఎస్టేట్‌ సర్కారు తుమ్మల మధ్య నేను బందీనైన//ఆస్తమా రోగి లెక్క//శ్వాసకోసం తండ్లాడుతున్న. నా చుట్టూ వున్నవి అన్ని కూడా నువ్వే లాగెసుకున్నవు ...ఒక ప్రాంతాన్ని అబివృద్ధి చేసాక కూడా నాకు హక్కు లేకుండా చేసావు ....కష్ష్ట ఫలాలను నీకు ఇచ్చి ఎముకల గూడు నీ అయ్యాను ...నేను నా ప్రాంతం అన్నప్పుడు ఆవేదన కనిపిస్తుంది ... సూర్యుడు నీవోడయ్యిండు//సుక్కలన్ని నీ కుక్కలయినవి.//బళ్ళు నీవి, గుళ్ళు నీవి మడులు నీవి, మాన్యాలు నీవి//చెమట నెత్తుర్లు ధార పోసి//మిగిలిన బొక్కల గూడును నేను. నా చేతికి ఇంటి తాళాలు ఇస్తూ కూడా నన్ను బొమ్మలా కూర్చో బెట్టి ....నా ఇంట్లో నన్ను బానిసను చేసావు కదా ...అవును ఏమో ... మల్లెసాల మీద మంచమేసి/.సాధికారంగ సకులం ముకులం పెట్టి చర్నాకోల చేతవట్టి//నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి. ఇంకా జరిగిన అన్యాయం చాలు ఇప్పుడు అయిన నాకు న్యాయం కావాలి .....ఇడుపు కాయితం (విడాకులు ...), పెద్ద మనుషల మధ్య ఇద్దరం విడి పోవటమే కావలిసింది అంటూ పరిష్కారాన్ని ముగింపు లో ఇచ్చి రెండు ప్రాంతాలు ...కలిసి ఉండలేము అని నిర్ణయానికి వచ్చినపుడు సోదర భావం తో విడి పోవటం మంచిది కదా ... /ఇగ ఇప్పుడైనా//పనుగట్లకీడ్చి//పంచాయితి పెట్టి//ఇడుపు కాయిదం అడుగక ఇంకేం చెయ్యాలె?// తెలంగాణా ఉద్యమం లో నుంచి పుట్టిన ఎన్నో అధ్బుతమైన కవితలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం ...ఎంతో చక్కగా సరళం గా ...వివరించారు ...వారి సంకలంనం లో మరెన్నో ముత్యాలు వున్నాయి..మరొకసారి మంచి కవిత ను అందించిన లింగా రెడ్డి గారికి ధన్యవాదాలు . మరిన్ని కవితా కుసుమాలను అందించాలని కోరుతూ .. సెలవు ... ఫిబ్రవరి 5, 2014 ---- ఇడుపు కాయితం ----- పుస్తెలతాడు కట్టించి తన్నుకు చావమని సాపెన పెట్టిండు సచ్చినోడు. 1 తాటికమ్మల గుడిసన్నా లేదని రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. కాసులు లేని కనాకష్ట కాలంల నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన. గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె కుడిదాయి కుడిపి కుతిదీర్చిన. నా రామసక్కని కుర్చీ ఇచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన. నిన్నేమన్న కర్రె కుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా? 2 మర్లువెళ్ళన్నా కాలేదు కాళ్ళ పారాణన్నా ఆరలేదు ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి. పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య అడ్డు తెరలెందుకంటివి సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి ఈ కాపురం నేనొళ్ళనంటె కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి. 3 కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష బాగలేదని చీదరిస్తివి. ఎగిలివారగట్ల వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి యాసనెక్కిరిస్తివి కట్టుబొట్టుమీద కథలల్లి కోట్లు కూడ పెడ్తివి. సెలిమలు దోచి సేనెండవెడ్తె కన్నీళ్ళు నాకాయె నీళ్లు నీకాయె. నిల్వ నీడలేదు చెయ్య కొల్వు లేదు ఉనికి ఉనుక పొట్టయితుంటే నా కుర్చి నాక్కావాలంటె ఇకమతులతోటి కాలం కమ్మలు మర్లేస్తివి. 4 నా ఇంటి చుట్టూ మొలిచిన ప్రైవేటు ఎస్టేట్‌ సర్కారు తుమ్మల మధ్య నేను బందీనైన ఆస్తమా రోగి లెక్క శ్వాసకోసం తండ్లాడుతున్న. సూర్యుడు నీవోడయ్యిండు సుక్కలన్ని నీ కుక్కలయినవి. బళ్ళు నీవి, గుళ్ళు నీవి మడులు నీవి, మాన్యాలు నీవి చెమట నెత్తుర్లు ధార పోసి మిగిలిన బొక్కల గూడును నేను. మల్లెసాల మీద మంచమేసి సాధికారంగ సకులం ముకులం పెట్టి చర్నాకోల చేతవట్టి నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి. 5 ఇగ ఇప్పుడైనా పనుగట్లకీడ్చి పంచాయితి పెట్టి ఇడుపు కాయిదం అడుగక ఇంకేం చెయ్యాలె? రచనా కాలం: 29 అక్టోబర్‌ 2007 'తెలంగాణ కవిత 2008' 'సూర్యుడు ఉదయిస్తాడు' సంకలనం

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMRYUE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి