ఈనాటికవిత-68 _____________________________ రమేష్ పమ్మి ||నాకెప్పటికీ సమాధే|| తెలుగులో కథాత్మకవిత్వం-కావ్యాలు రావాలని..అందునా వచన కవిత్వం దానికి ఊతంగా నిలవాలని కుందుర్తి ఆశించారు.అందుకోసం సంస్థలు ఆవిర్భవించాయి..తరువాతి కాలంలో కవిత్వం రకరకాల సంప్రదాయాలు,ఉద్యమాలలొ పడ్దాక ఈ అంశంపై తెలుగు వచన కవిత పెద్దగా దృష్టిపెట్టలేదు.శ్రీ శీలావిర్రాజు దీనికో సం కొంత కృషిచేసినవారిలో ఉన్నారు. మంచి అభివ్యక్తితో,కథనుకూడా చేరుస్తూ కవిత్వం చెప్పడానికి వచనకవితకుండే నిడివి సరిపోదు.ఆ స్ఫూర్తిని కలిగించడానికి కొంత అవకాశం ఉంది..రమేశ్ పమ్మి రాసిన కవిత అలాంటిదే.ఒక మాతృస్మృతిలో రాసినట్టు కనిపించే ఈ కవిత సాంద్రమైన మానవీయభావనని పెనవేసుకుంది.ఆ క్రమంలోనే నగరాలు విస్తరిస్తున్నప్పుడు కలిగే పరిణామాలని కూడా స్పర్శించింది. తల్లికి దూరమైన ఓ కొడుకు గొంతుతో ఈ కవిత ప్రారంభమవుతుంది...చిన్నతనం లో ఏ మయిందంటే కాకెత్తుకెల్లిందని అనేవాళ్లు..అలాంటి పిల్లలలో ఉండే సహజ అధ్భుత రసాన్ని అనుభవించే వాక్యాలున్నాయి. "ఒకప్పుడు అల్లంత దూరాన అందంగా అగుపించేటిది మా అమ్మ ఆమే అమ్మన్న విషయం.. మా రావక్క సెప్పేదాకా నాకూ తెనీదు ఆయమ్మ నను కంటే.. కాకమ్మ ఈడ పడేసినాదట నాకంటే పెద్దది కనుక రావక్కకు ఇదంతా తెలుసు అక్క సెప్పగానే... అమ్మా అని పిలుద్దామనుకున్నా.. కానీ ఏడ్వాలిసొచ్చింది అయ్యాలే మా అమ్మను సంపేశారు.. గండ్ర గొడ్డలతో, రంపపు కోతలతో పాశవికంగా నరికి సంపేశారు.. కొన్నాళ్లకు ఆడో.. పెద్ద సమాధి కూడా కడుతుంటే.. అమ్మకు పూజలు సేత్తారనుకున్నా ఏం సిత్రమో కానీ ఆ సమాధిపైనే చానామంది కాపురమెట్టారు." ఈ వాక్యలలో భాషాసంబంధంగా మంచి మాండలికం కూదా ఉంది..కవిత్వానికి కేవలం ఆఖ్యానం (Neretion)సరిపోదు..దానికి కవిదైన ముద్రనందించే వ్యాఖ్యానం(Comment)కావాలి.ఆ వాక్యాలు చివరన కనిఉపిస్తాయి. "గుబురుగున్న చెట్ల మీద దెయ్యాలుంటాయని అక్క సెప్పేటిది ఆ మాను సమాధి మీద కూడా దెయ్యాలుంటాయని అయ్యాలే నాకర్థమైంది ఆ దెయ్యాలకది నివాసమేమో.. నాకెప్పటికీ సమాధే వాళ్లేమో కాలనీలంటారు నేను శ్మశానం అంటాను" మంచి కథనాత్మకత కల కవిత ఇది.ఒక దృశ్యాన్ని అనుభవించేందుకు దగ్గరగా తీసుకెళుతుంది.. తాత్వికంగా,కళాత్మకంగా రమేశ్ పమ్మి కవిత ఇంకా వృద్దిచెందాల్సి ఉంది.అంశం కొత్తది.చెప్పిన పద్దతి కూడా వైవిధ్యమైంది.కొత్త ఊహలు చేయటం..కొత్త దృశ్యాలని చెక్కటం సాధన చేస్తే ఈ కవి కవిత మరింత బలంగా తనగొంతును నింపుకుంటుంది.మంచికవితను అందించి నందుకు రమెశ్ పమ్మి గారికి అభినందనలు
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH9Hiz
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH9Hiz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి