పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kotha Anil Kumar కవిత

@ ఒకరికి ఒకరం @ కొత్త అనిల్ కుమార్. 14/02/2014 అలా సాగిపోతున్న నా శ్వాసకొక నిశ్వాసం తగిలింది నా చుట్టూ మోగిన ఉష్ణ పవనాలకు అదొక మలయ మారుతం ఆ పరిచయం నాకొక కొత్త ఉచ్చ్వాసాన్ని ఇచ్చింది ఆ పరిచయమే నా ఊపిరికి సరికొత్త పరిమళం నిజమే, మరి తను లేని నా ప్రయాణాన్ని ఊహించలేను అసలు ఆ ప్రయాణమే ఉండదు తనతో కలిసి ఏడడుగులు వేసేటప్పుడు ఆ వెనకే తానుంది అవును , నా వెనకే ఉంది... నా ప్రతి సంధర్బానికి ముందు వెనక తానే ఉంది నాలో ఆమె ఉంటూనే...నను తనలో దాచుకుంది సుప్రభాత గీతానికి రాగలెవరు రాశారో, కాని నా అనురాగ గీతానికి సప్తస్వరాలు కూర్చింది తానే. ఉషోదయ గగనానికి అరుణవర్ణం ఎలా వచ్చిందో, నా జీవన వనమంత స్వర్ణమయం చేసింది తానే ఇంద్రధనస్సుకు ఏడురంగులెవరు వేశారో, కాని తను మాత్రం నా హృదయాకాశనికి హరివిల్లయ్యింది ఎందుకో మరి, తెలిసి తెలియకనో ఏమో నేను లేనిదే ... తాను లేనంటుంది తాను లేనిదే నేను లేనని తెలియక. ప్రేమ లేనిదే మేమిరువురం ఉండలేమని తెలియక. ఒకరి కోసం ఒకరు ఉండడమే... ఒకరుండక పోతే ఇంకొకరు ఉండ లేకపోవడమే. ప్రేమ అనే మాట . అని తనకు తెలియక. _ _ _ _ (కవి సంగమం సాక్షిగా ... నా శ్రీమతికి చిరు కానుక.)

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c6NDct

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి