పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Gangadhar Veerla కవిత

నేను పేద్ద ప్రేమికుడ్ని ....................................... నేను ప్రేమ గురించి.. లక్షల పేజీల కావ్యాలు రాస్తాను నేను ప్రేమ గురించి.. వేల సంఖ్యలో కవితలల్లుతాను నేను ప్రేమ గురించి.. లోతైన అక్షర సేద్యం చేసి.. అంతుపట్టని ఉపమానాలెన్నో అల్లుతాను నేను ప్రేమ గురించి.. నేలవిడిచి సాము చేస్తాను.. నేను ప్రేమ గురించి.. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తాను ప్రేమ గురించి నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెెలియదు ప్రేమ కోసం మంటల్లో నడిచొస్తాను.. ఆ ప్రేమ కోసం నిలువెల్లా కాలిపోతాను.. ప్రేమకోసం ప్రపంచాన్నే మరచిపోతాను నేను గొప్ప ప్రేమికుడ్ని ఎంతగా అంటే.. నిజజీవితంలో ఎదురొచ్చే సాటిమనిషిని ఏమాత్రం మనిషిగా చూడలేని గొప్ప ప్రేమికుడ్ని ఎదుటివాడి జీవితంలో ప్రేమను, అనుబంధాలను చూడలేని కళ్ళులేని కబోదిని నేను గొప్ప ప్రేమికుడ్ని కాగితాలపై అందమైన ప్రేమలు ఒలకబోసే... పేద్ద ఇగోయిష్టిని ........ -గంగాధర్, ఫిబ్రబరి 14

by Gangadhar Veerla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MS8Q0n

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి