కూరాకుల వెంకట చలపతి బాబు ||ప్రేమ-తోడు|| కనుబొమ్మల విల్లుతో అధరం అనే అమ్ములపొది నుండి ఆమె విసిరిన చిరునవ్వు అనే నారచరం యద కవాటాలను చీల్చి తియ్యని గాయం చేసింది.. హృదయ గాయానికి తన తలపులనే కుట్లువేసి తన నవ్వునే మందుగా వాడి బ్రతికేస్తున్నా.. అయినా కంటికి కునుకు లేదు మనసుకు మరుపు రాదు.. ఏంటా ఇది అని ఆరా తీస్తే "ప్రేమ"న్నారు ప్రేమంటే? ప్రేమ గుడ్డిదన్నారు కొందరు.. నలుపు,తెలుపు,ఎరుపు పొట్టి,పొడుగు అందం,చందం ఇవి ఏమి పట్టించుకోదు కదా ప్రేమ గుడ్డిదే! ప్రేమ మూగదన్నారు ఇంకొందరు కనులతో భావాలు పంచుకుంటూ మనసుతో మమేకమై తలపులలో జీవిస్తుంటే ఇక మాటలెందుకు ప్రేమ మూగదే! ప్రేమ పిచ్చిదన్నారు పేద,ధనిక కులం,మతం పట్టించుకొకుండా సమానత్వ భావాన్ని చూపిస్తుంది కదా ప్రేమ పిచ్చిదే! ప్రేమకి అనేక భావాలు చెప్పారు కాని ప్రేమంటే చెప్పలేదు ఎవరు.. నాకు నేనై ప్రేమ ని అన్వేషించా సోధించా చివరికి సాధించా (పాక్షికంగానే..) మనిషి తన జీవితానికి తోడును వెతుక్కునే క్రమానికి పెట్టిన పేరు ప్రేమ అని నాకు అనిపించింది.. అందుకే ప్రేమని వెదకటం ఆపేశా చిన్న నవ్వుతోనే జీవితాంతం గుర్తుండే తియ్యని బాధాని ఇచ్చిన ప్రేయసితోడుకై నా పయనం సాగించా... #14-02-2014
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cDFRDE
Posted by Katta
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cDFRDE
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి