మౌనమాఘం వెన్నెలా, వెన్నెలా నా కంటివెన్నెలా నా మనసువెన్నెలా ఒక పాట పలకరింపు ఒక మాట పులకరింపు ఒక తోట పలవరింపు చూసినందుకో,మాట్లాడినందుకో మోహనాద్భుత శబ్దసముద్భవమైన ఆత్మీయస్పర్శాస్పృహకో, సామీప్యతకో ఎట్లా తడిసిపోయాయి కళ్ళు ఆకాశపుతెర కదిలిపోయేదాకా నిరీక్షణే ఎపుడో అరుదుగా నెలకొక నిండువెన్నెలపున్నమి నీ రాక ఎంత ఆనందమే వెన్నెలా నీ దాక వస్తే ఎంత సంతోషమే వెన్నెలా ఎపుడో వొస్తావని ఏళ్ళుపూళ్ళుగా ఎపుడో నా కలల్ని గారవిస్తావని ఎప్పట్నుంచి ఎదురుచూస్తున్నా నీకోసం వొస్తావో రావో, మళ్ళీ వెన్నెల వొస్తుందో రాదో 14.02.14
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dPKytE
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dPKytE
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి