చినుకుల్లా ఊహలేవొ మది చేలో కురవాలి అపుడపుడూ చిరునవ్వుల విత్తులేవో మొలకెత్తీ మెరవాలి అపుడపుడూ పట్టులాంటి మెత్తనైన నీలికురుల దట్టమైన నీడలోన మనసు కాస్త సేదదీరె ఆశ మొగ్గ తొడగాలి అపుడపుడూ ఈ నల్లని చీకట్లను ఛేదించే కంటివెలుగు వెంట ఉంటె రాత్రి రంగు మార్చేసే ఉత్సాహం కలగాలి అపుడపుడూ పేరుకున్న దిగులునైన మంచులాగ నునువెచ్చగ కరిగించే ఆ మాటల హాయి సెగను తలచి చూపు కరగాలి అపుడపుడూ మిణుగురులా మెరుస్తున్న సౌందర్యం దీపంలా కనువాకిట పెట్టుకునీ బతుకు నేల వెలుగుముగ్గు వేయాలి అపుడపుడూ పెదాలపై ప్రవహించే నగవులనే తనివిదీర కనుచూపుల దోసిలిలో తాగాలని తహతహలతొ గడపాలి అపుడపుడూ నువ్వున్నా లేకున్నా ఈ గూటిలొ జ్ఙాపకాల పావురాలు ప్రేమకథలు చెప్పుకుంటూ ఆనందం పంచాలి అపుడపుడూ నీడలాగ వెంటాడే ప్రతిఊహా నర్తించే దీపశిఖే వర్షించే మబ్బు కళ్ళు దియా మనసు తుడవాలి అపుడపుడూ
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzDcit
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzDcit
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి