రాక్షస రాజ్యం ప్రజాస్వామ్యం కంట్లో కారం కొట్టారు ప్రజల నోట్లొ మట్టి కొడుతున్నారు కల్లు పాక కుమ్ములాటలు వీధి రౌడీల బాహాబాహీలు ఔరా వీళ్ళా మన పాలకులు? ఖర్మ కాకపోతె, రాజ్యాంగ ద్రోహులు ప్రజల కోసం ప్రజల వలన ప్రజల దైన రాజ్యం నిండు సభలో ప్రజల సాక్షిగ ప్రజల తీర్పు అపహాస్యం ఓట్ల కోసం ,సీట్లకోసం,కూడ బెట్టిన ధనం కోసం ప్రజా క్షేమం మాత్రం అసలుకే మోసం డ్రామాలు ధర్ణాల క్లైమాక్సు పండింది ప్రపంచం ముందు మన పరువు ఫక్కని నవ్వింది అతి పెద్ద ప్రజాస్వామ్యం డొళ్ళ అని తేలింది సుపరిపాలనకు ప్రత్యామ్నం వేరు కుంపటి అనుకుంటె గుణం మారని చేతుల్లో ప్రజల పాట్లు తప్పవు కట్టు బాట్లు,నియమాలు విలువలు లేని రాజకీయం చెలియల కట్ట దాటిన సిగ్గులేని విరాంగం కాలం మానం ధనం కాపాడే చట్టసభలు దొంగల పాలయితే ఇక దేవుడేదిక్కు
by Girija Nookala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUyT2S
Posted by Katta
by Girija Nookala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUyT2S
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి