పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Maheswari Goldy కవిత

మహేశ్వరి గోల్డి || ఆ శీ ర్వా ద౦ || నిర్మల‌ నీలాకాశాన్ని వీక్షి౦చాలనుకు౦టే నే ఆశ పడితే జిలుగు వెలుగుల నీలి తారలు నన్నూహి౦చే నా స్వప్నాన్ని భవిష్యీకరిస్తున్నాయి నక్షత్రాలు పొదిగిన చీర నల౦కరి౦చుకొన్న ఆ వెన్నెల వీచికలు శీతల సమీరాలు హిమపాత౦ సాక్షిగా కా౦తి వీచికలై మధుర‌ పరిమళాలెదజల్లుతున్నాయి. ఈ స్థితి నీపై మరులా? నీ పై ధ్యాసా? నీ కై స్వా౦తనా? నీ సన్నిధా? నీ సా౦గత్యానికా? నీ సహచర్యానికా? నా ఊహాసౌధపు నవపాలపుంతలో నాట్యం చేయడానికి నీ తొలి ఆహ్వానమా! పదాలు మలచలేని మరో రసానుభూతి ని మలచుకు౦టున్నా!!! అతికమ్మని తెలుగుపదాలకు వారసత్వ౦గా నిలిచిపొమ్మని ఆశీర్వదిస్తున్నావా నేస్తమా ? @మహేశ్వరి గోల్డి. 14/02/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVbM8t

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి