పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

పులిపాటి గురుస్వామి || గడియారం గుంజుకు పోతుంది ||

పగలుకున్న అన్ని ముఖాలు
ఇంకా తెలుసుకోక ముందే

రాత్రికున్న అన్ని కోణాలు
ఇంకా స్పర్శ లోకి మలుచుకోక ముందే

నిజానికి చుట్టుకున్న కొత్త జీవితం
అడుగుల్ని తడపక ముందే

దృష్టికి ఉన్న స్వచ్చత
మనసుని ఇంకా కడగక ముందే

ప్రేమ కి ఉన్న ఓదార్పు
ఇంకా తల నిమరక ముందే.....

.....ప్రతి రోజు పాతదై పోతుంది
పదును వయసు ముడతలౌతుంది.
*06-07-2012

1 కామెంట్‌:

  1. ఆర్.దమయంతి.8 ఆగస్టు, 2012 8:58 AMకి

    నిజానికి చుట్టుకున్న కొత్త జీవితం
    అడుగుల్ని తడపక ముందే ,
    ***
    ....ప్రతి రోజు పాతదై పోతుంది
    పదును వయసు ముడతలౌతుంది.'

    -నిజమే. పాతదై, రేపటికొక కొత్త జ్ఞాపకమౌతుంది..కదూ?
    అభినందనలతో-
    ఆర్.దమయంతి.

    రిప్లయితొలగించండి