పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Sri Modugu కవిత

Srimodugu // Once…. // Once you start disliking Do not have to do anything Just nod your head, turn around .... Do not wait for acceptance You get bundles of relief like Pouring cold water on cold day Looks like all filled with gray May be eyes filled with water But clears vision like Fog obliterates slowly on windshield It wipes gray, heals pain Just nod your head, turn around..... Date:31/01/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1efbitv

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // స్వార్ధ నిస్వార్ధులం // అవును నిజమే ఉంటూనే ఉన్నాం నిజమైన అబద్ధపు జీవితంలో కాని ఇది నిజంలో బతకడం అంత సులువైనదా …. ఏదో ఒక పాత్రతో ఈరంగస్థలికి వచ్చిన వాళ్ళమే రంగేసుసు కోకుండా నటనలో జీవించలేని వాళ్ళం నిర్మించుకోవాలని కలలు కనేవాళ్ళం ప్రేమ కావాలని ఆరాట పడేవాళ్ళం... ఇక సూర్యోదయాల్ని అనుభవించాలని సుర్యాస్తమయాల్ని హత్తుకోవాలని మాటలతో కడుపు నింపుకోవాలని కన్నీళ్ళ యరలతొ మనుషుల్ని జయించాలని ఇన్నికాలాల్లో వసంతాన్ని మాత్రమే కోరుకొనే స్వార్ధ నిస్వార్ధులం….. Date: 29/01/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGvPEb

Posted by Katta

Rama Krishna Perugu కవిత

//పెరుగు రామకృష్ణ // గల్లంతు ... ! // వాడి పారేసే సంస్కృతి దురాక్రమణలో పాత పని ముట్లకి తుప్పు పట్టి బంగారం లాంటి శ్రమ చేసే చేతులకి గోరింటాకు పెట్టాయి .. పరదేశపు సెంటు స్ప్రే ల వరదలో స్థానిక అత్తర్ ఆసామి అడ్రెస్సు గల్లంతు సరికొత్త "మాల్" సంతల్లో దేశీయ వస్తువులన్నీ దారిమారిన దయనీయ వైనం విలువ లేని చెత్తలో హస్త కళల కుప్ప.. ఒక నులివెచ్చని స్పర్స నాలుగు గోడలు దాటాక ఇప్పుడు మనిషికూడా పెట్టుబడిలేని వ్యాపారవస్తువే .. ? 31-01-2014

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGvNfK

Posted by Katta

Rama Krishna Perugu కవిత



by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dfm1OC

Posted by Katta

Kavi Yakoob కవిత

ఇలా సాగిపోదాం !!! ..................... 2013 నుండి ఇప్పటివరకూ 'కవిసంగమం' కార్యక్రమాలు ప్రతినెలా రెండవ శనివారం జరిగాయి. ఈ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కవిసంగమం కార్యక్రమంలో ఐదుగురు చొప్పున కవులు కవిత్వం విన్పించారు. 1. ఒక ప్రముఖ కవి. 2.ఇదివరకే కవిగా గుర్తింపు పొంది, 'కవిసంగమం'లోనూ రాస్తున్న కవి. 3.ముగ్గురు ప్రవర్థమాన కవులు. ఈ సంరంభంలో పాల్గొన్న కవులు ~ వేదిక :లామకాన్ .................... జనవరి 27- నగ్నముని | వసీరా | కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ . ఫిబ్రవరి 9 - నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్,జయశ్రీనాయుడు,క్రాంతి శ్రీనివాసరావు మార్చి 9 - విమల | బివివి ప్రసాద్ | యజ్ఞపాల్ రాజు,శాంతిశ్రీ ,చాంద్ ఉస్మాన్ ఏప్రిల్ 13 -వరవరరావు | కాసుల లింగారెడ్డి | అనిల్ డానీ,మెరాజ్ ఫాతిమా,నరేష్ కుమార్ మే 11 - దేవిప్రియ |కోడూరి విజయకుమార్ | సివి సురేష్,వనజ తాతినేని,బాలు వాకదాని జూన్ 8 - అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు,రాళ్ళబండి శశిశ్రీ ,తుమ్మా ప్రసాద్ వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్' ......................... జూలై 13 - శీలా వీర్రాజు | సత్యశ్రీనివాస్ | లుగేంద్ర పిళ్ళై,సొన్నాయిల కృష్ణవేణి,కృపాకర్ పొనుగోటి ఆగష్టు 10 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ |దాసరాజు రామారావు |కాశిరాజు,పూర్ణిమా సిరి,శ్రీకాంత్ కాన్టేకర్ సెప్టెంబర్ 14 -దీవి సుబ్బారావు |కుమారవర్మ| భాస్కర్ కొండ్రెడ్డి,భార్గవి జాలిగామ,పోతగాని అక్టోబర్ 5 -పాపినేని శివశంకర్ |శ్రీనివాస్ వాసుదేవ్| వర్చస్వి,రమాసుందరి,నాయుడుగారి జయన్న నవంబర్ 9 -నందిని సిధారెడ్డి |జాన్ హైడ్ కనుమూరి | మోహన్ రావిపాటి,కవితాచక్ర,బాల సుధాకర్ మౌళి ... డిసెంబర్ 15 -K_A_V_I_S_A_N_G_A_M_A_M_ P.O.E.T.R.Y F.E.S.T.I.V.A.L. ముఖ్య అతిధిగా గుజరాతీ కవి ప్రో.శీతాంశు యశస్చంద్ర పాల్గొన్నారు. అతిధులుగా కె.శివారెడ్డి,కె.శ్రీనివాస్,ఎం.వి.ఆర్.శాస్త్రి, అరుణ్ సాగర్, & గోరటి వెంకన్న పాల్గొన్నారు. .... జనవరి 25 న పొరుగు రాష్ట్రాల కవయిత్రులతో 'కవిత్వ సందర్భం : కవిత్వపఠనం,ముఖాముఖి' జరిగింది. తమిళ కవయిత్రి సల్మ, కన్నడ కవయిత్రి మమతా సాగర్ , హిందీ కవయిత్రి రతి సక్సేనా,వారితో పాటు భావన సోమయ్య,వినుత,రేవతి పాల్గొన్నారు. .... ఫిబ్రవరి 15న 'గోల్డెన్ త్రెషోల్డ్' లో ప్రముఖ కవులు హెచ్చార్కె,ఖాదర్ మొహియుద్దీన్ లతో పాటు విజయ్ కుమార్ Svk, మధు ఇరువూరి కవిత్వం చదువుతారు. కవిత్వం కోసం, కవిత్వస్ఫూర్తితో ఇలా ముందుకు సాగుదాం! కవుల్ని కలవడం,కలపడం కవిత్వం చదవడం,చదివించడం కవిత్వం వినడం, వినిపించడం కవిత్వం రాయడం, రాయించడం జయహో కవిత్వం !!!

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dfm1Ou

Posted by Katta

Krishna Mani కవిత

గతం **** గతించిన గడియల అలల నడుమ మరుపురాని పోర పోచ్చాలను పాతిపెట్టు సాగారగార్భాన దాచిన వాస్తవాలల ! మాయని గాయాలను మరచిపో సీతాకోకచిలక మారిన గొంగళి పురుగులా ! నలుగురు చూసి మురుసుదురు శిలగా మారిన రాతిని చుసేగా ! కృష్ణ మణి I 31 -01 -20 14

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1a9kC10

Posted by Katta

Jagadish Yamijala కవిత

కొన్ని ఊసులు ..... ------------------------------ 1 మాట్లాడని మాటల కన్నా చూడని చూపుల కన్నా నిన్ను తలిచే హృదయానికే బాధ ఎక్కువ ----------------------------- 2 మనల్ని నిజంగా అర్ధం చేసుకున్నవారికి మన చర్యలకు వివరణలు ఇవ్వవలసిన అవసరం లేదు --------------------- 3 నిన్ను ఆశీర్వదించిన వారెందరో లెక్కించుకో సమస్యలను కాదు.... ------------------------------ 4 మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చు కానీ అతను ఏడిచే క్షణాలు నిజమైనవి ----------------------- 5 కనులకు కనిపించిన వారెవరూ హృదయంలో చోటు సంపాదించలేరు హృదయంలో చోటు సంపాదించిన వారెవరూ కనులకు దగ్గరలో లేరు ------------------------------ 6 నిన్ను ప్రేమించడంతో మరెవరినీ ప్రేమించకుండా ఉండడాన్ని నేర్పించింది నీ మీద నాకున్న ప్రేమ ------------------------------- యామిజాల జగదీశ్ 1.2.2014 --------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0EJ0U

Posted by Katta

Yasaswi Sateesh కవిత

స్వాతి శ్రీపాద గారి కవిత అదే తెలుగు-వెలుగులో

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cENBJv

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // జీరో డిగ్రీ! // అతను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కానీ మనుషుల్లో కొద్దిగా ఒరిజినాలిటీ కోసం వెతికాడు- మాటల్లోనూ, చేతల్లోనూ, అడుగుల్లోనూ, అనుకోకుండా ఎదురయ్యే ఒక బిచ్చగాడికి ఔదార్యంతో స్పందించే తీరులోనూ. ప్రేమలోనూ, కోపంలోనూ, రాగంలోనూ, ద్వేషంలోనూ, పాత బస్ స్టాండ్ లో అనేకానేక సంవత్సరాల తర్వాత తారసపడ్డ ప్రియురాల్తో జరిపిన సంభాషణలోనూ. "ఉహూ... లాభం లేదు. అనుకరణ ఆకాశం నుండి అవని దాకా కమ్మేసింది" అంటూ గొణుక్కున్నాడు. పిల్లాడికి పీచుమిఠాయి బండి గంట వినిపించినంత ప్రియంగా తోచేది, ఒకప్పుడు మనుషులు వస్తున్న అలికిడి. తేరిపార చూడ్డం, కొంత వాళ్ళకు తెలిసీ, మరికొంత వాళ్ళకు తెలీకుండా ఫాలో అవడం, ఫాయిదా లేదని తెల్సుకుని మనాదించడం... "ముసుగులే ఎక్కువ లొసుగుల్ని చూపిస్తాయి మేకప్పే మేని వికృత స్వరూపాన్ని పట్టిస్తుంది లేనివి ఉన్నవిగా చూపెట్టే కొద్దీ ఉన్నాయని అనుకుంటున్నవి లేనివిగా తెల్సిపోతుంది" బయటకే అన్నాడు. చుట్టూ ఎవరూ కనిపించలేదు కానీ, అతనికి "చుప్ బే సాలే" అని ఎవరో గట్టిగా కసిరినట్టు వినిపించింది! 17.11.2012

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cENBJg

Posted by Katta

R K Chowdary Jasti కవిత

కమలం ఒక చీకటి మురికి తటాకంలో ఎంతటి సౌందర్యపు కమలం శరీరంలో ఆత్మలా! © జాస్తి రామకృష్ణ చౌదరి 31.01.2014@8.34AM

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0EItT

Posted by Katta

మరువం ఉష కవిత

Sneha | One Step Closer ---------------------------- Shots heard ‘til the back of the line. Ten shots, ten more, The line is shortening. Step-by-step I approach death. His arms wide open, Accepting. Memories flashed past, Family, mother, father, brother, I will meet you soon. Reality snaps back, Three sets left, now two, One. I step, Others step forward from behind What thoughts have they? It’s their last. Time has come, Fear is not what I have. Goodbye Hell, Hello Family. /**************************** రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ జర్మనీలు తాము దండయాత్ర చేసి స్వాధీనం చేసుకొన్న అనేక యూరోపియన్ దేశాల్లోని యూదు మతస్థులని పట్టి బంధించి గేస్ చాంబర్లలో చంపేసారు. స్నేహ నా పాప. పోయినేడు 12సం. పాయంలో హోలోకాస్ట్- అంటే అగ్ని, గేస్‌లని ఉపయోగించి అధిక సంఖ్యులని చంపడం- ద్వారా మరణం పాలైన ఒక బాలిక చివరి క్షణాల మానసిక స్థితి ని ఊహిస్తూ రాసిన కవిత ఇది. ఈ మధ్యన వింటున్న అనేకానేక యుధ్ధబీభత్సాలు మరే మనసుని కలచివేస్తున్నాయి. విశ్వశాంతి కి ఏదైనా సంభవిస్తే బావుణ్ణు. *****************************/ మరువం ఉష | ఒక అడుగు చేరువగా ------------------------------------ వరుస చివరికంటా గుళ్ళమోత వినవచ్చింది పది తూటాలు, మరొక పది వరుస తరిగిపోతూ ఉంది అడుగు వెంట అడుగు వేస్తూ నేను మృత్యువుని సమీపిస్తున్నాను వెడల్పుగా సాచివున్న అతని చేతులు సమ్మతినిస్తున్నాయి గతస్మృతులు వెలిగాయి కుటుంబం, అమ్మ, నాన్న, సోదరుడు మిమ్మల్ని నేను త్వరలోనే కలుసుకుంటాను వాస్తవం చిటెకెవేసి వెనక్కి లాగింది మూడు జట్లు మిగిలాయి, ఇకిప్పుదు రెండు ఒకటి నేను అడుగు వేసాను నా వెనుగ్గా ముందుకు సాగుతూ వాళ్ళు వాళ్ళు ఏ ఆలోచనల్లో ఉన్నారు? అదే వారి చివరి యోచన సమయం ఆసన్నమైంది నా వద్ద ఉన్నది భయం కాదు నరకమా, వీడ్కోలు హలో కుటుంబం. 01/31/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiYWwS

Posted by Katta

R K Chowdary Jasti కవిత

The Vine of Flowers That vine of flowers Climbed my life and embraced me With branches of her heart And took me into her skies And from where, I see only her eyes But not those highs And from there, she seeps into my sighs To enliven me with her love so nice! © R K Chowdary 01.02.2014@7.36AM

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ny3WUr

Posted by Katta

Sasi Bala కవిత

రాధను !!!!!........ శశిబాల .................................... రాధను నేనే మధుర గాథను నేనే వేణు మాధవుని మదినేలిన ప్రియ బాంధవి నేనే బృందావని వీడి కనుమరుగైన కన్నయ్యకై అహర్నిశలు ఎదురుచూపు చూసీ చూసీ కమ్మని కావ్యమై నిలచిన ప్రణయ రాశిని నేనే నా మనసుని కోటి పుష్పాలుగా చేసి కన్నయ్య పాదాలపై ప్రోగు పోసి మధుశాలనై ప్రణయ సుమ రాశినై శతకోటి యామినుల శశి బింబమై శతపత్ర చెలికాడు రవి బింబమై రసరాగ డోలలో ... కవన నర్తన హేలలో ............. మురిపించి ...మది మరపించి ..... హోయలోలికించి ... మది కదిలించి ..... వీణనై ...వర వీణనై .......... అనురాగ గందాల నిను ముంచనా సురలోక సౌఖ్యాల తేలించనా ................ సెలవీయవా ప్రభూ .................

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiYXkp

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

Dr. Varanasi Ramabrahmam 1-2-2014 Silent Love! Your Silence is Charming as your beauty; You are lovely within As full moon My heart is Shrine of Love You are the presiding Deity; Pleasantness and Bliss Sans you miss in me Peace is you and my mate Says my heart My dear Embodiment of Love In Silence; Shower me with your Delightful looks For Good books and good looks Are always inviting and bliss-giving; Drench me in your love! Oh! My Love! Share with me your beauty Heart and mind As now forever; For Sans your love and you I am Extinct!

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGc0wK

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||జీవితానికి సరిపడా కవిత్వం|| కవి సంగమంలో అడుగుపెట్టిన మొదటిరోజు చదివిన కవితనుకుంటాను, కవి సంగమానికి నన్ను అతికించిన కవిత కూడా,.బహుశా ఇది,..ఇప్పటికి అప్పుడప్పుడన్నా దాన్ని చదువుతుండకపోతే ఎందుకో మనసుకి శాంతిగా వుండదు,.జీవితంలో ఎదురయ్యే భిన్న సందర్భాలను తీసుకుంటూ,వాటిని ఎదుర్కోవటానికి అవసరమయ్యే చిట్కాలను సైతం సుతిమెత్తగా హత్తుకుని హృదయంలోకి నిశ్శబ్ధంగా చొచ్చుకొనిపోయే కవిత ఇది,. మొత్తంగా తొమ్మిది ముత్యాల మాల ఇది,.ఒక్కోసారి అంటూ,.మొదలై , ఒక ఆశావాహ దృక్పథంతో ముగిసే ఒక్కోక్క భాగము,..ఒక్కొక్క తాత్విక వాక్కులాగా అనిపిస్తుంది,నాకు,.. అందకనేనేమో,,,నేను దీనికి ఎంచుకున్న టైటిల్, జీవితానికి సరిపడా కవిత్వం,. అని,.. మనలోకి మనం తొంగి చూసుకోవల్సిన అగత్యం గురించి,.నిశ్శబ్ధాన్ని ఆశ్రయించాల్సిన అవసరం గురించి, ఆలోచనలు ఆర్పి శూన్యాన్ని ధ్యానించాల్సిన సమయం గురించి,.మనతో చర్చించినట్లే వుంటుంది, శత్రువు కూడా, అపోహలు తొలిగించుకుంటే స్నేహితుడిని ఎలా మించిపోతాడో,, జీవితాన్ని ఆత్మతో చేసే రసవత్తర ప్రణయంగా ఎలా మార్చుకోవాలో, వస్తువులతో కాదు, అనుబంధాన్ని ఆత్మీయులతో ఎలా పెంచుకోవాలో,.. తెలుసుకోవాలంటే ,,ఈ కవితను గుండెలోపలి చెమ్మగా మార్చుకోవలసిందే,.. సంతృప్తిగా సౌఖ్యాన్ని, కుదురుగా కూర్చోని గెలుపుని, పరీక్షలేకండా జీవితాన్ని ఎంత ప్రశాంతంగా ఆస్వాదించాలో అర్థం చేసుకోవాలంటే ఈ కవితను,.మనలోకి వంపుకోవలసిందే,.. ఒక భారమైన విషయాన్ని కవితా వస్తువుగా ఎలా మలుచుకోవచ్చో,ఎంత సరళంగా ఒక కవితను అల్లుకోవచ్చో, భావాన్ని ఎంత సూటిగా నాటుకోవచ్చో , స్పష్టంగా చెప్పిన కవిత ఇది,.. సమస్త సంశయాలు ధ్వంసం కావడం, రసవత్తర ప్రణయం గా తర్జుమాకావడం, గమ్యంలో వున్న గెలుపు గమనంలో దొరకడం, పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం మానేయడం, ఈ కవితలో నాకు బాగా నచ్చిన వాక్యాలు,... ,.కొంచెం నిడివి తగ్గించివుంటే మరంత బావుండేదేమో,.అని ఒక్కోసారి అనిపించినా,..లోతైన విషయం దృష్ట్యా అది మరగున పడుతుంది,కొన్నిసార్లు,. స్నేహితుడిని మించి శత్రువు సహాయం చేయడం,..అనే మాట కొంచెం కటువుగా ధ్వనిస్తుంది,.కానీ అలా జరిగే సందర్భాలను కూడా తోసిపుచ్చలేం. ఈ కవిత మీద కొందరి అభిప్రాయాలు ,. అణిముత్యమిది, భావనలో పరిపక్వత ప్రతి అక్షరంలోనూ ద్యోతకమౌతుంది, పునరుక్తి లేకుండా ఇలాంటి వస్తువుతో ధీర్ఘకవిత రాయడం కత్తిమీద సామే,………కరిముల్లా ఘంటసాల మనసుకి పండుగలా వుంది , ఈ కవిత చదివాక,జీవన తాత్వికతను కవితగా మలవడం గొప్పగా వుంది............కవి యాకూబ్ అందరికి ఎప్పుడో ఓ సారి మనసులో కదలి చెరిగిపోయే చిత్రం, చక్కగా గీసావు,..నందకిషోర్ ఒంటరి తనం నడిమధ్యలోకి నడవాలి,..ఆ లైన్ దగ్గర నేను నడక ఆపానేమో,,ఈ కవితలో ,...నా కవిత్వంలోనూ,........అఫ్సర్ ఒక్కోసారి ఇలాంటి కవితలు చదువుతుండాలి, ఏమో అలా చేస్తే కవితలెలా రాయాలో అవగతమవ్వావచ్చు,....సురేష్ వంగూరి,. ఉదాత్తమైన ఆలోచనా ధోరణి. మనిషికి, సమాజానికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఔషధం లాంటి కవిత,.....బివివి ప్రసాద్ కవిత్వం ఎలా వుండాలో చూపాలంటే, ఇలా అని ఖచ్చితంగా చూపాల్సిన కవిత,..కట్టా శ్రీనివాస్ నచ్చిన కవితను గురించి చెప్పేటప్పుడు, సాధారణంగానే,.కొంత ఎక్కువగా రాసేస్తాం,.కవిత్వం నచ్చడం వ్యక్తిగత అనుభవం కాబట్టి అసలు ఆ కవితలో ఏముందో తెలుసుకోవాలంటే వెంటనే చదివేయండి, మరి,. మీ కోసం ఆ కవిత,.మీ అభిప్రాయన్ని కూడా పంచుకుంటారని ఆశిస్తూ,. ఒక్కోసారి.. కిరణ్ గాలి 1. ఒక్కోసారి సమూహాలకి సాధ్యమైనంత దూరంగా,ఒంటరితనం నడిమధ్యలోకి నడవాలి నిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి ఏమో అలా చేస్తె సమూహాలలొ లేని స్నేహం, స్వాంతన, కోలాహలం నీకు నీలోనే దొరుకుతుందేమొ........ 2. ఒక్కోసారి శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలి కాలం అడుగుల చప్పుడు వినపడని ఖామోషి తేవాలి ఏమో అలా చేస్తే నిశ్శబ్ధం మౌనం వీడి నీతో మట్లాడవచ్చు, నువ్వు ఇదివరకెరుగని నిజాలను చెప్పవచ్చు నువ్వు నిజమనుకున్న అబద్దాలను చెరపావచ్చు 3.ఒక్కోసారి ఆలోచనలన్నింటిని ఆర్పేసి,శూన్యాన్ని వెలిగించి ధ్యానించాలి స్తబ్ధతలోని చైతన్యాన్ని, చైతన్యంలోని నిశ్చలతను అన్వేషించాలి ఏమో అలా చేస్తె ఆ ధ్యానంలోనే సర్వసత్యాలు సాక్షాత్కరించవచ్చు, సమస్త సంశయాలు ధ్వంసం కావచ్చు *** 1. ఒక్కోసారి స్నేహితులని కాకుండా , శత్రువనుకున్న వాడినీ సంప్రదించాలి అహాలు అపోహలు అడ్డురాకుండా అడగవలసినవి అడగాలి ఏమో అలా చేస్తే స్నేహితుడిలా సలహాలతో సరిపెట్టకుండా సహాయం కూడా చేస్తాడేమో 2. ఒక్కోసారి మనిషితో కాకుండా మనసుతో పరిచయించాలి తనువుతో కాకుండా ఆత్మతో సహచరించాలి ఏమో అలా చేస్తే పరిణయంగానె మిగిలిన ప్రహసనం, రసవత్తర ప్రణయంగా తర్జుమా కావచ్చు 3. ఒక్కోసారి కూడ బెడుతున్న సంపాదన కాకుండా దాచి పెడుతున్న కాలాన్ని కూడా ఆత్మీయులకు ఖర్చు పెట్టాలి ఏమో అలా చేస్తే కొని తెచ్చిన వస్తువులు ముడివెయ్యలేని అనుబంధాన్ని కలిసి గడిపిన క్షణాలు, కడవరకు తోడు తేవచ్చు *** 1. ఒక్కోసారి పొందవలసిన సుఖాల జాబితా పక్కన పెట్టి పోగొట్టుకున్న సంతోషాల చిట్టా విప్పి చూసుకోవాలి ఏమో అలా చేస్తే లేని వాటిలో వున్న సౌఖ్యం కన్న వున్నవాటిలో లేని ఆనందంమేముందని తెలుస్తుంది 2. ఒక్కోసారి పరిగెత్తటం మానేసి ఆయాస పడుతున్న కాలాన్ని, కుదురుగ కూర్చొని చూడాలి రాలి పడిన క్షణాలని, నిమిషాలని, రోజులని, దులుపుకొని జేబులో దాచుకొవాలి ఏమో అలా చేస్తే గమ్యంలో వుందనుకున్న గెలుపు గమనంలో దొరకావచ్చు 3. ఒక్కోసారి ప్రశ్నలడగడం, జవాబులు వెతకటం మానెయ్యాలి పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం ఆపెయ్యాలి ఏమో అలా చేస్తే ఫలితం గురించిన బెంగ లేకుండ స్వేచ్చగా జీవించవచ్చు, సంతృప్తిగా మరణించనూవచ్చు -------------------------------------------------- వీడియో చూస్తూ వినాలనుకుంటే,. ఇక్కడకెళ్లండి., http://ift.tt/1eehZMn -------31-1 -2014--------

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eehZMn

Posted by Katta

Vijaykumar Amancha కవిత

//ఓ అందని అదృష్టమా // 31-01-2014// ప్రతిక్షణం నా గుండె లో నువ్వుంటావు దురాతి దూరంగా వున్నా నాకు నువ్వు దగ్గరే అని పిస్తావు నిజానికీ మన మధ్య దూరం...ఏంతా ఏంతో నాకూ తెలియదు నువ్వు నాకు దూరమా...? దగ్గరా...? గుండెలయలో నీవు స్పందిస్తావు కనిపిస్తూనే వుండాలి కలల్లో వెలసి మండిస్తూనే వుడాలి మనస్సులో నిలచి మంటల్లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నా ఏదొ అశాంతి దండిస్తోంది హృదయాన్ని రెక్కలుంటే ఎగిరి వచ్చివుండేదాన్ని నీకు ...నా గుండె గాయాన్ని మానిపించేదాన్ని ఓ అందని అదృక్ష్టమా..... మన మధ్య దూరమేంతొ చేప్పు ********************* //---అమంచ విజయ్ కుమార్ //

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1km2rWP

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి||ఊహకందని కవిత.. నేను నేనుగా ఉండలేనితనం నుంచి వందేళ్ళ ఏకాంతవాసం లోకి వేయి దివ్య సూర్యులు వెలుగు కోరుతూ.. చాల గట్టిగ.. తట్టుకోలేనంత దగ్గరిగా నను వెక్కిరించే పక్షిని చంపాలని.. మనసే ఒంటరి వేటగాడై తెలియకుండానే జీవితం గడిచి పోతుంది ఈ గంట మోగింది ఎవరికోసమో మంచిచెడులతోటలో ఓ అర్థరాత్రి.. ప్రతీదీ వెలుగుతుంది కోరిక అనే వీధిబండి నాలో ఖాళీగా తిరుగుతుంది. ఎదిగే భావన ఏదైనా పోగవ్వాల్సిందేనా! నీనుండి నన్నెన్నడూ వెళ్ళనీకు మన నక్షత్రాల లోపాలు ఎన్నివున్నా కలరా వచ్చినప్పటి ప్రేమ మాత్రమే రోజులో మిగిలి ఉందినాలో గాలితోపోయినోడు సూర్యుడు.. వాడు కూడా ఉదయిస్తాడు మరునాడు ముసలోళ్ళకు రాజ్యం లేదు కదా!! అందరి కళ్ళు దేవుడ్నే చూస్తున్నాయి చస్తూనే పడుకున్నప్పుడు ఓ కుక్కకి రాత్రి ఎదురైన ఓ వింత అనుభవం వానలో పరుగుపందెం!! చందమామ.. మంచుకురిసిన పల్లవం ఓ మొండిపెళ్ళాం అమృతం వడకట్టిన జల్లెడ నా చెలికాడి సమాధి అంతా చీకటి నేను.. పిచ్చివాళ్ళకు దూరంగా.. పిచ్చుక గూటిపై.. ఓ ఈగ గాలినీడతో ముగింపును ఊహించడం. ఇది చదివిన వాడిది కదా! శ్రమ !! ఆ తరువాత ఇక్కడ ఎవరూ లేరు.. : Gabriel García Márquez లాంటి అసక్తికర శీర్షికల రచయితనైపోవాలని.. 30.01.2014

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klWYiW

via IFTTT

Srinivas Vasudev శనివారం శీర్షిక

It takes a life time to compose a beautiful poem for a poet....if he/she can't compromise with what they write. But if the motivation instigates it takes less than a fraction of milli second to dole out what they feel about a beautiful thought, and once it is there, it is there like this..Here it is! I requested a few of my poet friends to compose a few lines on the topic " Loner" and I was overwhelmed by the the response. Sarada Kuchibhotla & Sai Padma contributed to this topic and I was reading whole day all these poetry. Irrespective of my co-members' response here I have been enjoying the way it goes on Saturday's Edition of Kavi Sangamam...here it is friends..pls read the posts and post your valuable comments on these poems

by Srinivas Vasudev

from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Lxoz4l


Kancharla Srinivas కవిత

నిమిషాలన్నీ నీస్మృతులైతే.. క్షణమై కరిగే కాలం నిరీక్షణమై మిగిలింది.. క్షణమైనా ఆగని నీరు నీ కోసం నిలిచింది కదలనంది కాలం ప్రియా నువులేవని కరగనంది....

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frZPoA

via IFTTT

31, జనవరి 2014, శుక్రవారం

Jagadish Yamijala కవిత

మనసు ఆట ---------------------- ఆనందంలోనూ సరే ఆవేదనలోనూ సరే పక్కనే ఎందరున్నా ఎక్కడో కంటికి కనిపించనంత దూరాన ఉన్న వారి కోసం నా మనసు పరితపిస్తోంది ఎందుకనో.....? అందరి విషయంలోనూ అంతేనా లేక నా మనసు నాతో ఆట ఆడుతోందా? పోనీ పడే బాధ మనసుదేకదా అని వదిలేద్దామన్నా కుదరడం లేదు -------------------------------- యామిజాల జగదీశ్ 31.1.2014 ------------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klOp7M

via IFTTT