పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Sasi Bala కవిత

రాధను !!!!!........ శశిబాల .................................... రాధను నేనే మధుర గాథను నేనే వేణు మాధవుని మదినేలిన ప్రియ బాంధవి నేనే బృందావని వీడి కనుమరుగైన కన్నయ్యకై అహర్నిశలు ఎదురుచూపు చూసీ చూసీ కమ్మని కావ్యమై నిలచిన ప్రణయ రాశిని నేనే నా మనసుని కోటి పుష్పాలుగా చేసి కన్నయ్య పాదాలపై ప్రోగు పోసి మధుశాలనై ప్రణయ సుమ రాశినై శతకోటి యామినుల శశి బింబమై శతపత్ర చెలికాడు రవి బింబమై రసరాగ డోలలో ... కవన నర్తన హేలలో ............. మురిపించి ...మది మరపించి ..... హోయలోలికించి ... మది కదిలించి ..... వీణనై ...వర వీణనై .......... అనురాగ గందాల నిను ముంచనా సురలోక సౌఖ్యాల తేలించనా ................ సెలవీయవా ప్రభూ .................

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiYXkp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి