పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Yasaswi Sateesh కవిత

యశస్వి||ఊహకందని కవిత.. నేను నేనుగా ఉండలేనితనం నుంచి వందేళ్ళ ఏకాంతవాసం లోకి వేయి దివ్య సూర్యులు వెలుగు కోరుతూ.. చాల గట్టిగ.. తట్టుకోలేనంత దగ్గరిగా నను వెక్కిరించే పక్షిని చంపాలని.. మనసే ఒంటరి వేటగాడై తెలియకుండానే జీవితం గడిచి పోతుంది ఈ గంట మోగింది ఎవరికోసమో మంచిచెడులతోటలో ఓ అర్థరాత్రి.. ప్రతీదీ వెలుగుతుంది కోరిక అనే వీధిబండి నాలో ఖాళీగా తిరుగుతుంది. ఎదిగే భావన ఏదైనా పోగవ్వాల్సిందేనా! నీనుండి నన్నెన్నడూ వెళ్ళనీకు మన నక్షత్రాల లోపాలు ఎన్నివున్నా కలరా వచ్చినప్పటి ప్రేమ మాత్రమే రోజులో మిగిలి ఉందినాలో గాలితోపోయినోడు సూర్యుడు.. వాడు కూడా ఉదయిస్తాడు మరునాడు ముసలోళ్ళకు రాజ్యం లేదు కదా!! అందరి కళ్ళు దేవుడ్నే చూస్తున్నాయి చస్తూనే పడుకున్నప్పుడు ఓ కుక్కకి రాత్రి ఎదురైన ఓ వింత అనుభవం వానలో పరుగుపందెం!! చందమామ.. మంచుకురిసిన పల్లవం ఓ మొండిపెళ్ళాం అమృతం వడకట్టిన జల్లెడ నా చెలికాడి సమాధి అంతా చీకటి నేను.. పిచ్చివాళ్ళకు దూరంగా.. పిచ్చుక గూటిపై.. ఓ ఈగ గాలినీడతో ముగింపును ఊహించడం. ఇది చదివిన వాడిది కదా! శ్రమ !! ఆ తరువాత ఇక్కడ ఎవరూ లేరు.. : Gabriel García Márquez లాంటి అసక్తికర శీర్షికల రచయితనైపోవాలని.. 30.01.2014

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klWYiW

via IFTTT

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి