పిల్లలమర్రి // నవీన్ కోటి """""""""""""""""" ఇంటి ఇరుకుల్లోంచి సంత సరుకుల్లోంచి బయటపడి నిన్ను చూడటం పరుగెత్తీ చక్రంలా పరుగెత్తీ తల్లి ఒడిని చేరుకోవటం ఒక ఉపశమనం ఒక ఆనందం నిన్ను చూస్తే గది, గదికో కొమ్మలా విస్తరించి పనుల నదై ఇల్లంతా పాయలు, పాయలై ప్రవహించే మా అమ్మను చూసినట్లే నా భార్యను చూసినట్లే నిన్ను చూస్తే నా పాలమూరును చూసినట్లే దేశదేశాల్లో పుష్పిస్తున్న నా చేతుల్ని చూసినట్లే ప్రవేశద్వారం వద్ద అడుక్కుంటున్న అవ్వలా మాజా తాగేవాళ్ళని మళ్ళీ, మళ్ళీ చూసెళ్తున్న పేదపిల్లలా లోకం కళ్ళల్లో పడకుండా వాళ్ళిద్దరే లోకమయ్యే లోకాన్ని వెదుక్కుంటున్న పడుచుజంటలా మారాం చేస్తున్న బిడ్డకి కథలవుతూ అన్నం తినిపిస్తున్న అమ్మలా నీ నీడలో ఆడుతూ, పాడుతూ పిల్లల్తో పిలగాడైన నాన్నలా పలురూపాల్లో కనిపిస్తున్న నిన్ను చూడటం నేలలో పాతుకుపోయి పురివిప్పి నిలుచున్న నెమలిని చూడటం నీకింద నిలబడి తల పైకెత్తితే ఆకుల్తో అలంకరించిన ఆకాశాన్ని చూడడం నిన్ను చూస్తూ కూర్చుంటే ఉదయం మధ్యాన్నమౌతుంది మధ్యాన్నం సాయంత్రమౌతుంది నిన్ను చూసొస్తున్న ప్రతిసారీ ఐస్ క్రీంలా కరిగిపోతున్నావని మనిషిలా సంకుచితమౌతున్నావని సముద్రం నదై పోతున్న బాధ నది చెరువైపోతున్న బాధ చెరువు కరువై పోతున్న బాధ! ~~~~~~~~~~~ ~~~~~~~ ( "పాలపిట్ట " ఫెబ్రవరి-మార్చ్ 2014 సంచికలో ప్రచురించబడినది)
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kyzepB
Posted by Katta
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kyzepB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి