కొత్తబాట Posted on: Mon 09 Jun 05:07: 2014 ఇన్ని బాటల మధ్య ఒక కొత్తబాట వేయడం సులువేం కాదు ఇన్ని మాటల మధ్య కొత్తగా మాట్లాడటం ఇన్ని యుగళగీతాల గందరగోళాల మధ్య ప్రళయపోరాట గీతమెత్తుకోవడం సులువేం కాదు మళ్ళీ మళ్ళీ చౌరస్తాలో నిలబడతావ్ ఏ బాటైనా గమ్యానికి చేరుస్తుందా పున: పున: పరిశీలిస్తావ్ ఏ బాటైనా తనను తాను సరిచూసుకుంటుందా సరిచేసుకుంటుందా తనను తాను పునర్నిర్వచించుకుంటుందా పునాదుల్ని పునర్నిర్మించుకుంటుందా శ్రామికవర్గ వెన్నెముకను సమకూర్చుకుంటుందా ఎదురుచూస్తావ్ తప్పిపోయిన తల్లిరాకకై పిల్లవాడు ఎదురుచూసినట్టు వేచిచూసి, వేచిచూసి, అలసి సొలసి కమ్ముకుంటున్న నిరాశల అమావాస్యలో ఆకాశాన్ని చూస్తావ్ ఆశయాల నక్షత్రాలు చిరంజీవులై వెలుగుతూ వుంటారు మళ్ళీ అన్వేషణ మొదలెడతావ్ ఆశల పక్షులెగురుతాయి ప్రయాణం కొనసాగుతుంది. - నవీన్ సెల్: 9493320208 ( జూన్ 8, 2014 నాడు " ప్రజాశక్తి " దినపత్రిక ఆదివారం అనుబంధం " సోపతి " లో ప్రచురించబడింది. )
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZx41V
Posted by Katta
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZx41V
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి