రైలుపెట్టెలో బాలచంద్రుడు ........................................... నడవలేక పోతే పాకుతూ అయినావెళ్లు కానీ ...వెళ్లడం మాత్రం ఆపకు -అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలు అతడెప్పుడూ వినివుండడు పరిసరాలు పరిశుభ్రం గా ఉంచడానికి ప్రభుత్వపరంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం అతనికి చిన్న చెల్లెలు ఆగిన రైలు పెట్టెలోకి అకస్మాత్తుగా బల్లిలాగానో పిల్లిలాగానో దూరుతాడు వాడి చూపులన్నీ నీ పాదాల కింద పారాడుతున్న పల్లిపొట్టుపైనో సమోసా తిని నువ్వు గిరాటేసిన న్యూస్ పేపరు ఉండలపైనో గుట్కా పొట్లాల పైనో పాలిథీన్ కవర్లపైనో చించి పారేసిన చిత్తు కాయితాలపైనో నీ బూటు కాళ్ళతో నువ్వు మోసుకొచ్చిన బజారు దుమ్ముపైనో నిలిచిఉంటుంది తన అవిటి కాలుతోపాటు ఊతకర్రనూ ఈడ్చుకుంటూ తన ఒంటిమీద ఉన్న ఆ ఒక్క చిరిగిన చొక్కాను తుండుగుడ్డను చేసి తుడుచుకుంటూ నువ్వుఅసహనంగా చూస్తున్నా భరిస్తూ నీ పాదాల కింద పాము మెలికలు తిరుగుతూ పాచినంతా పరిశుభ్రంచేసి నీ వైపు చెయ్యి చాపితే ఇయ్యాలా వద్దా అని ఇరవైసార్లు ఆలోచించే నీ ఇంగితాన్ని తన దీన వదనంలో విలీనం చేసి జాలితోనో ప్రతిఫలంగానో నువ్వు చేజార్చిన నీ దగ్గరి చిన్న నాణాలు పిడికిట పట్టే ఆత్మ స్థైర్యం గల అవిటి బాలచంద్రుడు తనను నిలబెట్టడానికి లేని కాళ్ల మీద విసుగులేని విక్రమార్కుడు దేహానికేగాని మనసుకు వైకల్యం లేని స్వయంకృషి సూర్యుడు -వాధూలస 20/6/14
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l9pdDQ
Posted by Katta
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l9pdDQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి