శిబి శిల ................... ఊరికి పడమట అలసిన సూర్యుణ్ణి తన వెనకనున్న పడమటింటిలో పరుండబెట్టేందుకు కూచున్న రాళ్లరాసి గుట్టమ్మ పెరిగే తరిగే చంద్రుణ్ణి రోజూ సిగలో తురుముకున్నందుకేమో చందమామ గుట్టయ్యింది మా సోపాల ముంగట నిలవడి సూసినప్పుడల్లా నాకది శిలా పుష్పాలతో పేర్చిన పెద్దబతుకమ్మలా అన్పించేది సాయంత్రం ఈద్ గాహ్ ఎక్కి అటువైపు చూస్తే సూర్యశిరోమణి ధరించిన మహారాణి లా కన్పించేది బాపు పంపిస్తే తిర్మలయ్యగారింటికి వెళ్ళినప్పుడో షేర్ఖాన్ బాయికి మంచినీళ్లకు పోయినప్పుడో సూరమ్మ బాయికి స్నానానికి వెళ్ళినప్పుడో కన్నుల్లోనే వెలిగిపోయేది ఆ పడమటి గుట్ట మొన్న దాని పక్కపొంటి పోయినప్పుడు శతృవును చుట్టుముట్టిన యుద్ధ సైనికుల్లా మరముక్కు ల ఇనుపకొంగలు శవాన్ని పీక్కు తింటున్న రాబందుల్లా రాకాసి కోరల రంపపుచక్రాల యంత్రభూతాలు గుట్టుగా ఉన్న గుట్టను బట్టలూడదీసినట్లు కత్తితో కడుపులో పొడిస్తే పేగులన్నీ బయట పడ్డట్టు అందమైన చందమామగుట్ట ఆసిడు పోసినా ముఖంలా అందవిహీనవిదారక దృశ్యం నా వూరు అందాన్ని చెరిపేసుకుని ప్రపంచదేశాల భవంతుల అందాల్ని ఇనుమడింపజేయడానికి తరలి వెళ్తున్న నా ఎలగందుల శిలారత్నమా మున్నీట మునిగిన వూరోళ్ల నాదుకోవడానికి నడుం కట్టిన గ్రానైటు గండశిలా రాజమా! నిన్ను శిబి చక్రవర్తికి తమ్ముణివనిగాదు అన్నవన్నా తక్కువే !!!!.................... వాధూలస 17/5/14
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mDQIFA
Posted by Katta
by Rammohan Rao Thummuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mDQIFA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి