పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మే 2014, బుధవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-47 "ధన యోగం" అనే మాట ఎందుకు ఎందుకొచ్చిందో అని అనుకొనేవాడిని చిన్నప్పుడు... జనారణ్యం లో నా యాత్ర మొదలుపెట్టినప్పటినుంచి తెలుస్తోంది.... ఇక్కడ ఒకరి జేబులోనుంచి ఒక రూపాయి మన జేబులోకి రావాలంటే ఎంత ఓరిమి వహించాలో .. ఉన్న రూపాయిని కాపాడుకోవాలంటే ఎంత జాగరూకతతో ఉండాలో... బంధువులు,స్నేహితులు ఎవరూ నిజ సహకారులని నమ్మడానికి లేదు... ఈ వేటలో ఎప్పుడూ మనిషి ఒంటరి గా ఉండవలసిందే... సంసారం కంటే గుట్టుగా చేయలసినదేమైనా ఉందంటే అది ధనార్జనే... ఇది ఏ విద్యాలయం లోనూ నేర్పని విద్య.. అసలు దీనికి విద్యతో కూడ సంబంధం లేదు... అసలు ధనం సంపాదించే పరిణామక్రమం లోనే మనుషుల స్వరూపం అర్ధం అవుతుంది... ఈ ప్రపంచమూ అర్ధం అవుతుంది..! -------------------------------------------- 28-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nyzQAz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి