అయితే ఎంతైనా మణిరత్నం కదా ,తనదైన శైలి లో చూపించాడు. ఒక పోలిస్ అధికారి తన కుమార్తెకి జరిగిన అమానవీయ సంఘటన ని వివరిస్తూ దానికి కారకులైన వారిని ఏమీ చేయజాలని స్థితిలో ఉన్నానని హీరో కమల్ హాసన్ కి తన అశక్తతని వివరిస్తుంటాడు.ఈ సన్నివేశం సరిగ్గా God father నవల నుంచి తీసుకున్నదే.... అయితే ఎంతైనా మణిరత్నం కదా ,తనదైన శైలి లో చూపించాడు. నవల లో Don Vito Corleone (గాడ్ ఫాదర్ పేరు) దగ్గరకి Bonasera అనే రొట్టెల వ్యాపారి వస్తాడు.ఇద్దరూ ఇటాలియన్ లే.చాలామంది సిసిలియన్ల లాగానే అమెరికా లో బ్రతుకుతెరువుకి వచ్చినవారే.Human instincts ని వివిధ పాత్రల ద్వారా గొప్ప విశ్లేషణ చేస్తాడు రచయిత Mario Puzo.వీళ్ళలో అనేక వ్యాపారాల ద్వారా వృద్ది చెంది ఆధిపత్యం చెలాయించే కుటుంబాలు ఓ అయిదు ఉంటాయి.నిజంగా ఆ నవల స్పిరిట్ ని అర్ధం చేసుకున్నవాడు దానిలోనించి ఎన్ని కధలనైనా వండవచ్చు.మన మహాభారతం లాగా. ఊ ...అయితే ఈ Bonasera అన్ని ప్రయత్నాలు చేసి Don దగ్గరకొస్తాడు.అప్పుడు అంటాడు Don," మిత్రమా ఇప్పుడు నేను జ్ఞాపకం వచ్చానా..ఘనత వహించిన నీ అమెరికన్ చట్టాన్నే ఆశ్రయించలేకపోయావా..." అంటూ mimic చేసినతర్వాత మరి నీ కుమార్తె కి జరిగిన దానికి నన్నేమి చేయాలని అనుకుంటున్నావు అంటాడు.అప్పుడు Bonasera అతని దగ్గరకి వచ్చి చెవిలో ఏదో చెబుతాడు.(ఈ వివరించే స్టిల్ God fatherసినిమాలో చాలా ఫేమస్ అయింది) సినిమా కంటే నవల నే బాగుంటుంది నా దృష్టిలోనైతే.అతను ఆ చెవిలో ఏం చెబుతాడో బయటికి ఇద్దరు చెప్పరు గాని....' అంత శిక్ష వాళ్ళకనవసరం...అయితే వాళ్ళకి జరగవలసింది జరుగుతుంది.నువ్వు వెళ్ళు.' అంటాడు. వెళ్ళేటప్పుడు Bonasera ని ఉద్దేశించి గాడ్ ఫాదర్ అంటాడు." మిత్రమా నీపై గల స్నేహ భావం చేత నేను ఈ సాయాన్ని చేస్తాను.అయితే దీన్ని నువ్వు గుర్తు పెట్టుకో..నేను ఎప్పుడైనా ఏదైనా సాయమడిగితే చేయీ..ఆ రకంగా నీ రుణం తీర్చుకో". యూరోపియన్ లకి,మనకి ఉన్ననీతి లేదా ధర్మశాస్త్రాలలోని తేడా ఇక్కడే కనిపిస్తుంది.ఒక వ్యాపార సంబందమా స్నేహం అనేది...అని మనకనిపిస్దుంది. దాన్ని మించిన ఓ concept ని ప్రవేశపెడతాడు రచయిత.ప్రపంచమే ఇచ్చిపుచ్చుకోవడం లో ఉంది.ఆ loyalty ని నిలబెట్టుకుంటేనే వ్యవహారాల్లో అరమరిక ఉండదు అనేది వారి నీతి. Don't quarrel with people.First, reason with people గాడ్ ఫాదర్ యొక్క ముఖ్యమైన underline message లో అది ఒకటి.Don జడ్జిమెంట్ కొన్ని సన్నివేశాల్లో అతడి స్థిత ప్రజ్ఞతని తెలుపుతాయి.నీ వ్యక్తిగత రాగద్వేషాలను వ్యాపారం లో చూపించకు.అది వేరు.ఇది వేరు అని కుమారుడు Sonny Corleone కి వివరించే తీరు హృద్యంగా ఉంటుంది. అనేక వైరుధ్యాలు నిండిన ఈ ప్రపంచంలో Don ఒక సంపూర్ణ మానవుడా అనిపిస్తుంది నవలంతా చదివిన తరవాత. అతని కుమారుల పట్ల,కుమార్తె పట్ల,ఇంకా భార్య పట్ల ప్రవర్తించే విధానమంతా కేథలిక్ విశ్వాసాల భూమిక గానే ఉండి మనం కూడా అతనితో అనేక సన్నివేశాల్లో మమేకమవుతాము. Family మొత్తం కలిసి ఉండడం లోని బలం నిరుపమానమైనద్ని అతని నమ్మకం. దానిలో తన కుటుంబ సభ్యులే కాదు.అతని మితృలు కూడా ఉంటారు.("Friendship is everything.Friendship is more than talent.It is more than the Government.It is almost the equal of family" ఈ ఒక్క మాట చాలదూ ) తెల్లవాళ్ళ లోకం లో loyalty కి ఎందుకు అంత విలువ ...? ఎంతైనా నాకైతే అనిపిస్తుంది ముందు కళ్ళు తెరిచి ప్రపంచదేశాల మీద పడినవాళ్ళు కదా...అనుభావాల భావ ప్రపంచం వాళ్ళది చాలా విశాలమైనది.ఆవేశం ని అదుపులో ఉంచుకొని ఏమి జరగనట్టుగా ఉండడం ...ఊహించని కోణాల్లో దెబ్బతీయడం ....జంతువు లా విరుచుకుపడడం....మళ్ళీ చాలా సున్నితమైన ప్రేమ గుణాన్ని అర్ధం చేసుకోవడం...ఒకరికొకరు గొప్ప సమన్వయం తో సహకరించుకోవడం ఇలాంటి విరుద్ధ భావాలు వారిలో పుష్కలం.అమెరికా లో ఉన్న ఇటాలియన్ లయినా,ఇంకా ఇతర తెల్లవాళ్ళయినా వాళ కుదుర్లు ఎక్కడున్నాయో వారికి తెలుసు. సరే....ఎప్పుడైనా ఇంకా కొన్ని సన్నివేశాలగురించి ముచ్చటించుకుందాం. ------K V V S Murthy
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n93mf1
Posted by Katta
by Murthy Kvvs
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n93mf1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి