పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఆచూకి|| తెలుసుకోవడం క్రియే ... కానీ అది నిష్క్రియాప్రియత్వాన్ని వరించినా లోపలి దారి హఠాత్తుగా ఆగిపోయినా ఒక చీకటి మేఘం చిగురాకులా ఊగినా కొత్త వేకువ వైరాగ్యపు వరదల చప్పుడు వినిపించినా నీలోలక చలనపు ఆధార ఆకర్షణ అయిన తెలివే..... ఊడ్చే చీపురుకు మొదలు సరిచేసుకొనేలోపే వాకిలి విశాలమయి విషాదాన్ని శృతి చేస్తుంది పొరలు పొరలుగా అల్లుకొన్ననీవు ప్రాణవాయుప్రసార మార్గాల వెంట కొత్త పగుళ్ళలోచేరి ప్రయా్ణాన్ని కాసేపు ఆపివేస్తావు కొత్త లోకం లోకి జారిపడుతున్నప్పుడు నీటి బిందువులా నీలోకి నీవు గుండ్రంగా ముడుచుకొంటావు ఆపై చిద్రమై ఏదో ప్రవాహంలో కలసిపోతావు కొట్టేసిన వాక్యానివై కొత్తదనానికి పునాదివి అవుతావు నీ పుట్టుకకు చావుకు మధ్య బిగించికట్టిన కాలపుతీగను మీటే కారణాన్ని కనుగొనేందుకు నీకు తెలియకుండానే నీవే ఏదో ఆచూకి వదులుతావు

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tQMtd6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి