పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఫలిత బలం|| ఎందుకో ...ఈ మనుషులందరూ ఇనుప తీగల్లా సాగిపోతుంటారు .... ఇంటినుండి బయటకు ...బయటనుండి లోపలికి ... మనిషి నుండి మనిషికి ....వ్యవస్త నుండి వ్యవస్తకి .... అవస్త నుండి అవస్తకు ...సాగిపోతూనే ఉంటారు ఏదో లౌకిక విషయం మీటినప్పుడు ఒక ఋణాత్మక అంశం ప్రవహించి..విషాద గీతాలనాలపిస్తారు ముక్కలు ముక్కలుగా తెగిపోవడం చేతకాదు మళ్ళీ మొదలయ్యు చిగురించడం అంతకన్నాచేతకాదు.... మొక్కలు మనకంటే చాలానయం ...నిత్యం చిగురిస్తూ ఎదుగుతాయు మారాకులు వేస్తూ మనుగడ సాగిస్తాయి .. మనం...... కేవలం చిగురిస్తున్న ఆకులమే అందుకే అలాగే ఎదిగి రాలిపోతుంటాం ఎదో చైతన్య వృక్షానికి మనమంతా చిగురులమే సుమా..... జీవితాల సమాహారమే తప్ప జీవిత శకలాల సమాహారమంటూ ఏదీ దొరకదు ..మొత్తం జీవితమే ఒక శకలం కదా అనుభవ నేపధ్యం లోంచి మరో అనుభవం ...పొడుస్తున్నప్పుడు జీవితాలు...సారూప్యతలు లేని కొత్త సంతకాలు చేస్తూనే ఉంటాయి ఎప్పటి కప్పుడు కొత్త ఫలితబలాలు నెట్టే దారిని పలకరిస్తూ పోవడమే ......

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jF2fF4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి