మసి గుడిసెలు _________________ఆర్క్యూబ్ తొంగి చూస్తే ఏముంది ఏళ్ళకేళ్ళుగా ఇంతే ఎప్పుడు కూలుతయో తెల్వది నాలుగు దిక్కుల నాలుగు సలాకలు అవే పునాదులు ఆ గుడారాలకు మీరు మసి గుడిసెలనవచ్చు ఆ పసి వాళ్ళ మొఖాల్లోకి తొంగి చూస్తే అవి అక్కడా కనిపించచ్చు ఇనుప మంచం ఇనుప ఉట్టి ఇనుప పెట్టె అంతా ఇనుం ఇనుం ఇనుమూ బొగ్గూ మండి వాళ్ళు కత్తి కొడవలి గన్నూ బాడిసెలు పట్టుకారు చానం పోగర్ లు చిన్న పెద్దా ఆడామగా తేడా లేమీ లేవు అందరు కొలిమి పురుగులె వృత్తాలు గా తిరుగుతూ బరువుగా పడే గన్ను దెబ్బకు గురికావాల్సిందే బులోర్ గొట్టంలోంచి ఎగపోస్తూగాలి కొలిమి మంటలో కమాన్ పట్టీ ఎక్సెల్ డాకల్ మీద గొడ్డలవ్వాల్సిందే ఎక్కోలమీద తూము జేసుకొని చేతులు మారాల్సిందే కథ ఇంతటితో ఒడిసిపోతే బాగుండు పైకి లేసిన బూడిద మెల్ల మెల్లగా నిశ్శబ్దాల్ని పరుస్తుంటది కొలిమి సెగ కణికెలు ఒంటిమీద పడి పచ్చి పుట్టు మచ్చలై తేలుతై రూపు కెక్కుతున్న గొడ్డలి రవ్వలు తూటాలై వేటాడుతై కూసోని కూసోని పోద్దు కాళ్ళలో కుంగుద్ది పాతికేళ్ళమీద చీకటి పడి చాతిలోంచి తీతువు పాట లేస్తుంది పదితనానికేమెరుక మసి ముఖాల్ని పాడుతుంటది ఎక్కడొ బొగ్గు ముక్కలల్ల అగ్గి కథ రగులుకుంటది _ 31 డిసెంబర్ 2006 జనగామ బస్టాండ్ ఎదురుగా ఉన్న గుడిసెలు
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V1ENIe
Posted by Katta
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V1ENIe
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి