పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జూన్ 2014, ఆదివారం

Srinivasa Bhaskara Rao Yanamandra కవిత

//చీకటి పోవాలంటే వెలుతురు ఎంత అవసరమో అజ్ఞానం పారద్రోలాలంటే జ్ఞానం అంత అవసరం. వీటన్నిటికి మూలం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను వశపరచుకున్నవారు దేనికైనా సమర్థులు. ప్రపంచంలో చాలా రకాల జీవరాశులున్నాయి. ఒకో జీవి ఒకో వస్తువువల్ల కట్టుబడి పతనం చెందుతాయి. అవి తురంగ, మాతంగ, సతంగ, మీన, భ్యంగములు. తురంగం అంటే - జింక. జింక శబ్దానికి కట్టుబడుతుంది. మాతంగం అంటే - ఏనుగు. ఇది మావటివాని అంకుశానికి లొంగుతుంది. సతంగం అంటే - మిడత. మిడత వెలుతురుకి ఆకర్షించబడి ఆ మంటలో మాడి మసైపోతుంది. మీనం అంటే - చేప. ఇది ఎరకి బలైపోతుంది. భ్యంగము అంటే - తుమ్మెద. ఇది పూల రంగులకి పరవశించిపోతుంది. కాని మానవుడు ఈ జీవులన్నిటికన్నా హీనమైన వాడు. ప్రతి విషయానికి లొంగి పనతమవుతాడు. శబ్ద, రూప, రస, గంధాలకు వశమవుతాడు. అన్నింటికీ కుట్టబడిపోతాడు. వివేకాన్ని, బుద్ధినీ కోల్పోయి పతనం అయిపోతాడు. ఈ అయిదింటికి వశమయిన మానవుడు శాంతి, సుఖాలకు దూరమవుతాడు. అన్నింటికీ అతీతుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. దానికోసం కృషి చెయ్యాలి. మాట, తిండి, వాసన, వినికిడి, దృష్టి వీటన్నిటిని అదుపులో ఉంచుకోవాలి. నిజమైన దైవత్వమును పొందాలంటే వాగ్దోషము, దృష్టి దోషము, క్రియాదోషములను దూరము చేసుకోవాలి. అలా ఆచరించినప్పుడే మానవుడు మాధవుడవుతాడు. చరితార్థుడవుతాడు.//

by Srinivasa Bhaskara Rao Yanamandra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ntA5KO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి