పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మే 2014, ఆదివారం

Uday Dalith కవిత

శోక వసంతం ఆమని కోయిల విసుగెత్తి పాడే ఉల్లాస రాగాలు విన్నావు మాటిమాటికీ శిశిరాలు రాల్చే ఎండుటాకుల శోకాలు ఏ ఒక్కనాడైనా విన్నావా సాగర తీరాలు పదేపదే పలికే సంగీతాల హోరు ఎంతకాలం వింటావు ఆ భీకర అలల పోటు కంటే భయానక జీవిత కధలున్నాయి అవెప్పుడిక నువు వింటావు పూల వర్ణనలతో చిగురాకుల సున్నితాలతో కాలం అల్లే కావ్యాలు యుగయుగాలుగా విన్నావ్ వాడిపోతున్న సమాజ విలువలతో విలవిలలాడే జీవుల ఆర్తనాదాలు ఇకనైనా వింటావా ఉదయాలు మేల్కొలిపే శ్రావ్య గానాలు అరుణారుణ లేలేత అందాలు తెలుసు గానీ చెమట తడిలో బ్రతుకులీడ్చి తలరాతలతో చితులు పేర్చి దుఃఖమే కానీ సుఖమేలేని అభాగ్యుల జీవన పోరాటాలు ఇప్పుడైనా విను ఉదయ్ 03.05.14

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RbwM17

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి