ఏమాయే _____________________కృష్ణ మణి .....వేదన ఒరాల మీద అరిపాదాలు ఎక్కడవాయే నడుములోంచి నాట్లేసే నాలికల మీది పాటలకేమాయే నెత్తిమీది ఎండదాపు చెట్లకొమ్మల కింద సద్దిమూటలకేమాయే అలసిన తనవున అల్లరి మాటల పరాషకాలెక్కడవాయే బురదనీళ్లల కలుపులేరు మట్టిచేతులకేమాయే మొక్కల సందున నాట్యమాడే కల్వారలకేమాయే నాగలి అంచున ఇత్తులజల్లె నడకలకేమాయే శేనుచేతికొచ్చె సానవెట్టే కొడవళ్ళ సప్పుడుకేమాయే మూటగట్టి మెదగోట్టే చేతులకేమాయే బంతిగట్టే కాడేడ్ల మూగనవ్వులకేమాయే బరువులంటే ఎరుగని చెమట కండలకేమాయే కాయకష్టం ఇష్టమయిన నష్టమవని కన్నులకేమాయే ఆకలిమానిన పల్లెబతుకులు ఆగమాయే కూలిలేక కూడులేక కూలిన కూతలాయే మారినలోకంల మారని అతుకుల బొంతలాయే అన్నిటికి అన్నివుండే అన్నాయానికి ఆకలాయే ! కృష్ణ మణి I 04-05-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGquBZ
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGquBZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి