పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మే 2014, ఆదివారం

Ravela Purushothama Rao కవిత

గతితప్పని ధృతిలో----------- ================== రావెల పురుషోత్తమరావు మనసు శ్వేతపుష్పం లాంటిది. స్వచ్చంగా ఉన్నంతకాలం స్వర్ణకాంతులీనుతూ సౌరభాలను వెదజల్లుతుంది. సప్త వర్ణాలనూతనలోఇముడ్చుకుని ఇంద్ర ధనుస్సులా వెలిగిపోతుంది. కక్షలూ కావేషాలూ కన్నులెదుటగా కంట పడినప్పుడు కకావికలఔతూ కన్నీరును గారుస్తుంది. మంచితనం మానవత్వం పురివిప్పి నాట్యం చేస్తుంటే నేత్రపర్వంగావీక్షిస్తూ సంతసపడుతుంది. చిన్నపాటి మలయపవనం వీచినా పులకిత అవదనంతో పురస్కారంలా స్వీకరిస్తుంది. గాలి వేగం పెరిగి గందరగోళం సృష్టిస్తే ఘనీభవించిపోయి కరడుకట్టుకు పోతుంది. పంటపైరు లాంటి మనసును కలుపుమొక్కలతో నింపకూడదు. సున్నితమైన మనసును శూలలతో గుచ్చినట్లు బాధపెట్టకూడదు. మనసును మంచితనపు ఖజానాగా మనం అమూల్యంగా భావించుకోవాలి. ఒడుదుడుకులకు లోనైనప్పుడూ ఒద్దికగా సర్దుకుపోగలగాలి. అప్పుడే మనసు గతితప్పక అజరామరంగా ఆనంద సంభరితయై నిలుస్తుంది ***************************************************************04-05-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q1UQTv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి