నేనో అబద్ధం మళ్లీ నేనో అబద్ధం నా గానం నా కావ్యం నా ప్రణయం అబద్ధం కావు నేను నేనే అబద్ధం నా కలం నా గళం నా శోధన అబద్ధం కావు నాకు నేను ఓ అబద్ధం నా సొద నా సమాజం నా ప్రవాహం అబద్ధం కావు నేను కలగన్నదే అబద్ధం నా నవ్వు నా సత్యం నా విచారం అబద్ధం కావు వెక్కిరించు నేనో అబద్ధం నా చలనం నా గమ్యం నా సాహసం అబద్ధం కావు నేను మాట్లాడితే అబద్ధం నా అధరం నా యవ్వనం నా నిస్పృహ అబద్ధం కావు ఉదయ్ 03.05.14
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nbnnl8
Posted by Katta
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nbnnl8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి