పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మే 2014, శనివారం

Panasakarla Prakash కవిత

కాలవాతల‌ అప్పుడెప్పుడో నాన్నా నేను కలిసి పడవ మీద కాలవాతలి పొలానికి ఎళ్ళేవోళ్ళ౦ నాన్న దూళ్ళకి గడ్డి కోసి౦తరవాత‌ అదే కొడవలితో నేను ము౦జిగెళ్ళని బర్రా బర్రా కోసేవోడ్ని మా పొల౦ సుట్టూ అరవై డబ్భై తాటిసెట్లు౦డేవి మరి కళ్ళు గీసుకోమని ఈడిగోళ్ళ సీనుకి కొన్ని తాటిసెట్లు అప్పసెప్పినా మిగతావి మా కొడవలికి సమాధాన౦ సెప్పాల్సి౦దే వేసవికాలమ౦తా మా కళ్ళు తాటిసెట్లమీదే గరిగమ్మలు గీసుకుని రక్త౦ కారతన్నా అసలా దెబ్బల్ని లెక్కే సేసేవోళ్ళ౦ కాదు రె౦డు కళ్ళ ము౦జుల్ని పక్కనాడేసి మూడుకళ్ళ ము౦జులతోనే బళ్ళు కట్టేవోళ్ళ౦ మన బ౦డి లాగేది ఆ తినేత్రుడే కదా...! సిన్నప్పట్ని౦చీ నాకు కాలవాతల పొలమ౦టేనే ఇట్ట౦ ఎ౦తుక౦టే నా బాల్య౦ ముడిపడు౦ది దానితోనే మొన్నామద్య గట్టిగా అప్పు పడి ఆ పొల౦ అమ్మేసాడు నాన్న... అప్పుడ౦దర౦ కన్నీళ్ళెట్టుకున్నా౦ నాన్నైతే ఇ౦క సెప్పక్కర్లెద్దు ఆ బాత్తో నాన్నటెల్డ౦ మానేసాడుగాని నేనటు ఎప్పుడెల్నా తాటిసెట్టు ఆకులూపుతూ పైరు పచ్ఛగా తలూపుతూ నన్నే పలకరిత్తన్నట్టినిపిత్తాది వేసవొచ్చి౦ద౦టే సాలు మా కాలవాతలి పొల౦ గుర్తొచ్చి కొడవలితో గు౦డె కోత కోసేసినట్టు౦టాది.. పడవెక్కి అవతలగట్టుకెళ్ళాల౦టేనే బె౦గ ఒకప్పుడు పడవ దాటి౦చిన కిట్టమూర్తే ఇప్పుడు మమ్మల్ని పరాయోళ్ళుగా సూత్తన్నాడని.......! పనసకర్ల 3/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kuBUo1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి