_హింసాత్మ_ ఆత్మలంట వ్యక్తులంట పందులేం తింటాయో తెలిసి కూడా పందుల్ని తినేవాళ్ళు పందులే!! నువ్వేమాలోచిస్తావో అది నువ్వవుతున్నప్పుడు నువ్వేం తింటావో కూడా అది నువ్వైపోతూంటావ్ మనసొక్కటేకాదు మరి మనిషంటే.. అవ్యక్తమైన స్పృహని వాక్యాల్లో కక్కునే అసమాన దృష్టున్నందుకు, దివ్యత్వాన్ని పంచే తాపత్రయం ఉండొచ్చేమో వ్యక్తికి!! అంత మాత్రాన మనసుని మాత్రమే అనుకునే వ్యక్తిత్వానికి తిండెందుకు?? మలమెపుడూ వ్యక్తిగతమే.. పంచక్కర్లా!! కాదని మలం పట్టి తెచ్చే పుచ్చెక్కిన పుర్రెలకి మనసే మలం కాయం మరుగులో!! ఒంటిక్కావాల్సిన మోజుల్లో కంటికి ఒళ్ళే కనిపించనంత పరమాత్మావేశానిది ఆకలే తప్ప ఆలోచన కాదు!! ఆ దేహానికి లోకమొక రోగమంతే దాహం తీరక!! పొయ్యేదే ఏ దేహమైనాన్న నొప్పిలో పాడె మీద బతుకీడ్చేయాల్సిందే!!____ (3/5/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUYABC
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUYABC
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి