ఈ రోజు సారంగలో నా అక్షరాలు...... తిలక్ /అవ్వ :::::::::::::::::::::: యాడున్నడో కొడ్కు ఈది బళ్ళ సదివిండు ఇదేశాలకు పోయిండు నా కండ్లల పానాలు పెట్కొనున్నా వాడొస్తడని సత్తు గిన్నెలల బువ్వ పెట్టిన ఈయవ్వ యాదున్నదో లేదో గంజితాపించినగాని గరీబుగా పెంచలే కూలిజేసి కాలేజిల చేర్సినా కువైట్లా ఉజ్జోగమన్నడు గల్లీలల్ల గోలీలాడేటోడు డాలర్లులెక్కేస్తున్నడు గుడ్సెల సల్ల తాగినోడు నా కుతికల సుక్క పోస్తడో లేదో అప్పుడపుడు పైసలైతే పంపిస్తడు ఎప్పుడూ నన్ను సూడనికి రాలే పదేండ్ల క్రితం వానయ్య పీనుగయ్యిండు గియ్యలా నాకు తోడులేకపాయే వాడునన్ను సూస్తడని ఒక ముద్ద పెడ్తడనుకున్న నన్నిట్ల ఒదిలిపోయిండు అయినా ఆశ సావలే నేను మాత్రం దినం దినం సస్తున్న తిలక్ బొమ్మరాజు 25.04.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8Qlox
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8Qlox
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి