ఒక తాబేలు-కొన్ని చీమలు ____________________ఆర్క్యూబ్ సహజంగానే- చిరునవ్వుని కోల్పోనివాడు సాహసి గాక మరేమవుతడు లోకసంచారి సంపన్నుడుగా కాక మరే పేరుతో పిలువబడుతడు కలగని నిలబడ్డవాడు సముద్రంగా కాక ఇంకోల రూపాంతరం చెందడు కదా ! జ్యాలాముఖిలో పచ్చికుండ ప్రాయాలు జలపాతాఖాతాల్లో పట్టుదప్పని ప్రేమగీతాలు దోసిట- ఖండపు మంచులో అఖండంగా పూసిన పూలు అతడి డైరీ కల్లోలాలతో నిండిఉన్నా రెపరెపలాడుతుంది ఆ శబ్దహోరు విను మృత్యువుని జయించే రహస్యమేదో చెబుతుంది వీరుడి అడుగుల్ని పొదిగే అక్షరం పిట్ట ఇలా గాక మరెలా గానం చేస్తుంది అనుకున్న - పుట్టే బిడ్డ యుద్దకళల్ని నేర్చుకునే ఈ చిత్తరువును చూసి అచ్చెరువొందుతవని ఆ దృశ్యం ఈ నేల అద్దం తిరిగి తిరిగి నీ కళ్ళు ఈ చూపుడు వేలు తాబేలునే ముద్దాడుతై కొద్ది శ్రమతో ఇన్ని యోజనాల్ని ఎలా యాత్రించావో తెలుసా ఈ దారి కట్టిన చీమలు ఆ తాబేలు వర్షించిన కన్నీటి నెత్తుటి బొట్లే ఆ పిట్ట యుద్ద గానంలో నీలో తపస్సు చేస్తున్న స్వప్నం నిన్ను మెళకువలోకి ప్రత్యక్షించుకుంటుంది ఆ పిట్ట యుద్దగానం జీవన పోరాట కాంక్షని ఎంతగా మండిస్తుందో నీ చేతికందిన అమృతం నింపిన పాత్ర చెబుతుంది ఇక అడుగుల్ని సంధించు ఆనాది ఈ తోవలో నీ నడకకు అనుమతి లభించింది నీ నుండి సృజింపబడె చీమలు ఈ తొవ్వను వెలిగిస్తై
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jD67EV
Posted by Katta
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jD67EV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి