బయట వర్షం పడుతోంది ఇప్పుడు, ఉదయం నుంచి ఎండ వేడి ఎక్కువగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా చల్లబడి చిరు జల్లులు పడటంతో చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం , తీవ్రమైన ఎండ వల్ల వేడెక్కిన భూమి పొరలపై ఒక్కసారిగా వర్షపు చినుకుల తడి తగిలేసరికి వేడి నీటి ఆవిరి భూమి పొరలలోంచి పైకి వచ్చి ఒక రకమైన " మంచి సువాసన " వస్తోంది మట్టి నుంచి. అది కూడా చాలా బాగుంది. గాజు అద్దాలపైనుంచి కిందకి జారే వర్షపు నీటిని చూస్తో వేడి వేడి టీ తాగుతూ మంచి పుస్తకం చదువుకోవడమో,ఇష్టమైన పాటలు వినడమో చేస్తూ వర్షాన్ని ఆస్వాదించడం బాగుంటుంది కదూ? ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే నాకిప్పుడు ఒక వర్ణన గుర్తుకొస్తోంది శ్రీ కృష్ణ దేవరాయలు రాసిన " ఆముక్త మాల్యద " నుంచి. ' గర్భిణీ స్త్రీలు ప్రసవార్ధమై పుట్టింటికి చేరుట సాంప్రదాయం కదా? దీనిని మేఘముల విషయంలో సమన్వయించినాడు రాయలు ఈవిధంగా, చూడండి ' " సూర్యుని కిరణములచే మేఘములు రూపుదాల్చును. అవి సముద్రమునకు వెళ్ళి నీటిని గ్రహించి గర్భమును దాల్చి మరలా సూర్యుని చెంతకు చేరి వర్షించును " అని రాయలు తెలుగుదేశ ఆచారములను తన వర్ణన ద్వారా చాలా చక్కగా ప్రకటించాడు కదూ? శుభసాయంత్రం. - - Kks Kiran
by Kks Kiran
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s6Z5sV
Posted by Katta
by Kks Kiran
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s6Z5sV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి