II ఓ మనిషి నువేక్కడా..? II యాకయ్య . వైట్ల ****************************************** ఇది రంగుల లోకం, 'పొంగు'ల మైకం, హంగుల ఆర్భాటం. అందలమెక్కి, చిందులు తొక్కే, వాతల నేతల మేతల కోతల, కూడలి కుక్కల కోలాటం. కాసుల జడిలో 'కుబుస'పు కులుకులు కాకుల కూడును, తినే ప్ర'బుద్దు'లు. పిక్కలు పెంచి, దిక్కులు కొనే యోచన నేంచే వారి పంచన చేరి, పబ్బం గడిపే నక్కల ఆరాటం. సందులో నక్కి విందును చూచే పందుల జంజాటం. ఇదేనా నువు "మనిషి''గా పుట్టి సాగించే జీవనపోరాటం. గంజిలో ఈగల మూతులు నాకే, యతుల సుతులు వల్లించే నీతులు. 'రాజు'ల రాతలు మబ్బుల రీతులు. వారి చేతి గీతలా.. మన తలరాతలు.?? కాదు .. కాదు .. కాదు ..!!! మనిషిలో 'మనిషి'ని దూరం చేసే మోహపుజూదమే "అధికారం". ఇది ఆడని బ్రతుకులు "అంధకారం" ఇది జగన్నాటకం కానే కాదు జంతువులు ఆడే బూటక నాటకం. జగమెరిగిన సత్యం, జననం మరణం. జాతుల వైరం, జంతురూపకం. అరె..ర..రే, నేను "ముస్లిం" ను... నేను "హిందు" వును.. నేను "క్రిస్టియిన్" ను.. నాది భౌద్ధం... నాది జైనం.. నే "కుక్క"ని నే ''నక్క''ని నే "యదవ"ని అంటాడే ... అరె ఏ ఒక్కడు... ఏ ఒక్కడు.. ఏ ఒక్కడు... ఏ ఒక్కడు.. నే మనిషినని అనడే..! నీ కాలే కడుపుకి కూడేట్టే ప్రకృతిదేకులము..? నీ ఎగసే గుండెకి ఆయువైన వాయువుదేమతము..? నీ మురికట్టిన పదములని ముద్దేట్టుకునే భూ'మాత''దేజాతి..? నీ 'దిక్కుమొక్కు'గా కొలిచే 'దివి'దెవర్ణం..? సచ్చి 'సమాధై'తే నువు వుండే చోటెక్కడ..? ఓ.... మనిషి.... "అసలు" నువేక్కడా..? 08/05/2014
by Vytla Yakaiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iugzK5
Posted by Katta
by Vytla Yakaiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iugzK5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి